Most Recent

అమ్మబాబోయ్..! నాని హీరోయిన్ ఎంత మారిపోయింది.! అప్పుడు క్యూట్‌గా ఇప్పుడు ఇలా

అమ్మబాబోయ్..! నాని హీరోయిన్ ఎంత మారిపోయింది.! అప్పుడు క్యూట్‌గా ఇప్పుడు ఇలా

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. నాని సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథ అంతగా ఎక్కకపోయినా నాని నటనతో ఆకట్టుకున్నాడు. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అలాగే నాని కెరీర్ లో మంచి ఫీల్ ఉన్న సినిమాగా నిలిచిన మూవీ భీమిలి కబడ్డీ జట్టు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోకపోయినా నాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010లో విడుదలైంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పల్లెటూరి కుర్రాడిగా నాని కనిపించాడు. తమిళ చిత్రమైన వెన్నిళ కబడి కుళు కు ఇది రీమేక్. ఈ సినిమాలో నానికి జోడిగా శరణ్య మోహన్ నటించింది. ఈ ఇద్దరి జంట ఎంతో చూడముచ్చగా అనిపించింది.

అయితే శరణ్య చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. శరణ్య మోహన్ తమిళ్, మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. అలాగే కన్నడ హిందీ సినిమాలోనూ నటించింది ఈ చిన్నది. తెనుగులో కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది శరణ్య. ఆతర్వాత భీమిలి కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ కత్తి సినిమాల్లో నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో ఆయన చెల్లెలిగా నటించి మెప్పించింది.

ఈ సినిమా తర్వాత ఆమె తిరిగి తెలుగులో నటించలేదు. తన చిన్ననాటి స్నేహితుడు, వైద్యుడు అరవింద్ కృష్ణన్‌ను ఆమె 2015 లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన శరణ్య మోహన్ సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది ఈ చిన్నది. సినిమాల్లో క్యూట్ గా కనిపించిన శరణ్య .. ఇప్పటికీ అలానే క్యూట్ గా ఉంది. తాజాగా ఈ క్యూట్ లేడీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

శరణ్య మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Saranya Mohan (@saranyamohanofficial)

శరణ్య మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Saranya Mohan (@saranyamohanofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.