ఇటీవలే గామి సినిమాతో విజయం అందుకున్న విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూల్లు సాధించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. అయితే ఈ క్యూరియాసిటీని తగ్గించేలా.. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. అయితే సర్‌ప్రైజింగ్‌లీ … థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది విశ్వక్ జీవోజీ ఫిల్మ్. అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే విషయం రీసెంట్‌గా నెట్ ఫ్లిక్స్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ ను తమ అఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం జూన్ 14 నుంచి అందుబాటులో ఉండనుందని తెలియజేసింది. ఇక మాస్ యాక్షన్ నేపథ్యంలో దాదాపు పదకొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎనిమిది రోజుల్లో 19.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విశ్వక్ కెరీర్లోనే బిగ్ హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. కానీ విడుదలైన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరీ ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంచనాలు తలకిందులు చేస్తూ.. OTTలోకి కార్తికేయ సినిమా