-
కొన్ని వారాలుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేదు. కొత్త సినిమాలు రావట్లేదు.. అసలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయట్లేదు. చేసేదేం లేక థియేటర్స్ మూసుకున్నారు ఎగ్జిబిటర్లు. ఇలాంటి సమయంలో మే 31 కాస్తో కూస్తో ఆసక్తి పుట్టించింది.
-
కానీ ఇప్పుడు ఆ తేదీ నుంచి ఒక్కొక్కటిగా సినిమాలు తప్పుకుంటున్నాయి. మరి దానికి కారణమేంటి..?ఎందుకో తెలియదు కానీ ఈ సమ్మర్‌ను పూర్తిగా వదిలేసారు మన నిర్మాతలు.
-
ఎన్నికలు అయిపోయాయి.. ఎండలు తగ్గిపోయాయి.. ఐపిఎల్ కూడా చివరికి వచ్చేసింది.. అయినా కూడా సినిమాలు రిలీజ్ చేయట్లేదు. మే 25న లవ్ మీతో మళ్లీ మూత పడిన థియేటర్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత మే 31న కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి.
-
మే 31న ముందు అరడజన్ సినిమాలు విడుదల తేదీ ఖరారు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నాయి. ప్రస్తుతానికి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా అదే రోజు రానున్నాయి. కానీ ఆ రోజే రావాల్సిన సత్యభామతో పాటు సుధీర్ బాబు హరోం హర సినిమాలు వాయిదా పడ్డాయి.
-
మే 31న కృష్ణ జయంతి సందర్భంగా హరోం హర విడుదల చేయాలనుకున్నా.. దాన్ని జూన్ 14కి వాయిదా వేసారు దర్శక నిర్మాతలు. అలాగే సత్యభామ సినిమాను జూన్ 7కి పోస్ట్ పోన్ చేసారు. వీటి వాయిదా కచ్చితంగా విశ్వక్ సేన్ సినిమాకు హెల్ప్ కానుంది. ఏ మాత్రం బాగున్నా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాసుల వర్షం కురిపించడం ఖాయం. చూడాలిక.. ఏం జరగబోతుందో..?