కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌కు షాకిచ్చారు డైరెక్టర్ లింగుస్వామి. నిర్మాత సుభాష్ చంద్రబోస్ తో కలిసి నిర్మాతల మండలలిలో కమల్ పై ఫిర్యాదు చేసినట్లు ఇండియా టూడే నివేదిక పేర్కొంది. 2015లో తెరకెక్కించిన ఉత్తమ విలన్ సినిమాను కమల్ హాసన్ తోపాటు.. తిరుపతి బ్రదర్స్ కు చెందిన సినీ నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా తమను అప్పులోకి నెట్టిందని నిర్మాతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కమల్ కాంట్రాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తమ విలన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థతో కలిసి రూ. 30 కోట్ల బడ్జెట్ తో మరో సినిమాకు పనిచేస్తానని కమల్ ప్రామీస్ చేశాడని.. టూరింగ్ టాకీస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగుస్వామి పేర్కొన్నారు.
అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో చిత్రయూనిట్ పంచుకుందని.. కానీ ఆ సినిమా స్క్రిప్ట్ చాలాసార్లు కమల్ మార్చడం వల్లే డిజాస్టర్ అయ్యిందని..దృశ్యం సినిమా రీమేక్ కోసం కమల్ ను సంప్రదించినా అతడు స్పందించలేదని.. దీంతో వేరే నిర్మాతతో ఆ సినిమాను చేసినట్లు తెలిపాడు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం కమల్ తమతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదని అన్నారు. కమల్ హాసన్ ఎప్పుడూ తన ఆలోచనలను మార్చుకుంటాడని.. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆలోచనలతోనే సక్సెస్ అయ్యాడని అన్నాడు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు లింగుస్వామి.
తాను ఉత్తమ విలన్ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని అన్నారు లింగుస్వామి. ఈ సినిమా నష్టాలు.. మరో కొత్త నిర్మించడం విషయంలో చాలాసార్లు కమల్ హాసన్ ను కలిశామని.. కానీ మరో సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో తప్పని పరిస్థితులలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు.
A clarification about #Uthamavillian pic.twitter.com/6CURcEMPBv
— Thirrupathi Brothers (@ThirrupathiBros) April 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.