Most Recent

Brahmamudi, May 27th Episode: చిత్రతో రాజ్ రెండో పెళ్లి.. అత్తని లాజిక్‌తో కొట్టిన కళావతి!

Brahmamudi, May 27th Episode: చిత్రతో రాజ్ రెండో పెళ్లి.. అత్తని లాజిక్‌తో కొట్టిన కళావతి!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య బయటకు వెళ్లి రాగానే.. రాజ్ తన ఫ్రస్ట్రేషన్ బయట పెడతాడు. మళ్లీ ఎలాంటి ఘనకార్యం చేసుకురావడానికి వెళ్లావ్? టిఫిన్‌లు, భోజనాలు అన్నీ చేసి మీద పడిపోతుంది. ఏదో సాధిస్తానని చెప్పి.. పులిని తీసుకొచ్చి ఈ మేక మీద వదిలేశావ్? మరి ఈ మేక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? అని రాజ్ అడుగుతాడు. అది ముందు మేకలానే కనిపించింది. కానీ అది మేక తోలు కప్పుకున్న పులి. మీరు ఏమీ టెన్షన్ పడకండి.. అది మీ గదిలోకి రాదని అంటుంది. ఏంటి బుజ్జీ.. ఆ ప్రమాదం కూడా ఉందా? దీన్ని అలానే వదిలేస్తే ఈ ఇంటి పెద్ద కోడలు అయిపోయే ప్రమాదం ఉంది. అది దొంగ మాయా అని చెప్పలేం. ఆ బిడ్డ దాని బిడ్డ అని చెప్పలేం. అది అడ్డం పెట్టుకుని అది చేసే ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నామని రాజ్ బాధ పడుతూ ఉంటాడు. ఏం బాధ పడకండి. అసలు నిజం ఖచ్చితంగా బయట పడుతుంది. ఏం చేయమంటారు? పరిస్థితులను బట్టి సర్దుకు పోవాలి. నేను కూడా నిలువుగా బుక్ అయిపోయానా? ఎలా బయట పడాలో ఆలోచిద్దామని కావ్య అంటుంది. అమ్మో అయితే మనం జాగ్రత్తగా ఉండాలని రాజ్ అనుకుంటాడు.

లాయర్‌కి ఫోన్ చేసిన అపర్ణ..

ఈ సీన్ కట్ చేస్తే.. అపర్ణ.. శర్మ అనే లాయర్‌కి ఫోన్ చేస్తుంది. మీరు అర్జెంటుగా నేను చెప్పిన పని చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది.. మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఇది అస్సలు బయటకు వెళ్లకూడదని అపర్ణ అంటుంది. మీరు ఈ సమయంలో కాల్ చేశారంటే.. అది ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఏంటో చెప్పండి మేడమ్ అని లాయర్ శర్మ అంటాడు. ఆ తర్వాత అపర్ణ విషయం అంతా చెప్తుంది. మేడమ్ బాగా ఆలోచించే చెప్తున్నారా అని లాయర్ అంటే.. బాగా ఆలోచించే ఈ విషయం చెబుతున్నానని అపర్ణ అంటుంది.

దుగ్గిరాల ఇంట్లో విడాకుల రచ్చ..

ఇక తెల్లవారుతుంది. అపర్ణ అందర్నీ హాలులోకి పిలుస్తుంది. ఇంతలో లాయర్ వచ్చి.. డాక్యుమెంట్స్ ఇస్తాడు. సరే ఇక మీరు వెళ్లండి. మీ అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తానని అపర్ణ అంటుంది. ఏంటి అవి? అని సుభాష్ అడుగుతాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా.. ఈ ఇంట్లో జరిగే గొడవలు ఆగడానికి.. మన పెద్దరికాన్ని నిలబెట్టుకుని న్యాయం జరిపించడానికి ఈ నిర్ణయం తీసుకున్నా అని అపర్ణ అంటుంది. అసలు ఇంతకీ ఆ పేపర్లు ఏంటని ప్రకాశం అడిగితే.. విడాకుల పత్రాలు అని అపర్ణ అంటుంది. దీంతో ఇంట్లోని సభ్యులందరూ షాక్ అవుతారు. విడాకులా.. ఆ మాట ఎవరి నోటా వినకూడదని మీ మావయ్య చెప్పారు కదా అని ఇందిరా దేవి అంటుంది. కానీ తప్పడం లేదు అత్తయ్యా.. తప్పుడగు వేసిన వారికి అని అపర్ణ అంటుంది. ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడేది? అని రాజ్ అంటే.. నీకు అర్థమైందన్న విషయం నాకు తెలుసు. నువ్వూ, కావ్య విడాకులు తీసుకోవాలి అని అపర్ణ అంటుంది.

నువ్వూ, కావ్యా విడాకులు తీసుకో..

ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావ్? అని పెద్దావిడ అడుగుతుంది. మాయకు పుట్టిన బిడ్డ ఈ ఇంటి వారసుడు. కాబట్టి.. వాడికి వారసత్వం కల్పించాలంటే రాజ్.. మాయను పెళ్లి చేసుకోవాలి. అలా పెళ్లి చేసుకోవాలంటే కావ్యతో ముందు విడాకులు తీసుకోవాలని అంటుంది. దీంతో రుద్రాణి, చిత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరికి న్యాయం చేయడానికి.. ఇంకొకరికి అన్యాయం చేయాలా? అని సుభాష్ అడుగుతాడు. సరే మీరు చెప్పండని అపర్ణ అంటుంది. రాజ్‌కు పెళ్లి చేస్తే.. కావ్యకు ఏం న్యాయం జరుగుతుందని స్వప్న అంటే.. ఏడాది నుంచి కావ్యకు ఈ ఇంట్లో ఏం న్యాయం జరుగుతుంది? అసలు రాజ్‌కి ఇష్టం లేకుండా పెళ్లి చేసింది మీ అమ్మ. కాబట్టి అన్యాయం గురించి ప్రశ్నించే హక్కు మీ కుటుంబం కోల్పోయింది. రాజ్ నిజంగానే కావ్యని ఇష్ట పడి ఉంటే.. ఈ పాటికే వాడు బిడ్డను కని ఉండేవాడు. కాబట్టి ఇష్టం లేని భార్యాభర్తలు కలిసి ఉండటం అనవసరం.

మాయతో పెళ్లి..

వాడు మాయని ప్రేమించాడు. కానీ ఇంట్లో చెప్పలేక నలిగిపోయాడు. బిడ్డ పుట్టాక దూరంగా ఉండలేక ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మాయ కూడా తెరచాటు నుంచి బయటకు వచ్చింది. వాళ్లిద్దరి మధ్య బలమైన బంధం ఉంది కాబట్టే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని అపర్ణ అంటే.. ఇది ఇప్పటి వరకూ తేలిపోవాలా? అని సుభాష్ అంటాడు. రేపు ఈ విషయం మీడియాకు తెలిస్తే.. రచ్చ రచ్చ అవుతుంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా మాయతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని అపర్ణ అంటుంది.

అపర్ణకు ఇచ్చిపడేసిన సీతా రామయ్య..

అమ్మా అపర్ణా.. నువ్వు అన్ని సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించగలవు కాబట్టే.. ఈ ఇంటి బాధ్యత నీకు అప్పగించాం. కానీ ఇప్పుడు కావ్యకి విడాకులు ఇప్పించడానికి అసలు నువ్వు ఎవరు? నీకేం హక్కు ఉంది? వాడేం కట్టెకు తాళి కట్టలేదు. ఏది ఏమైనా అగ్నిసాక్షిగా వాళ్లు పెళ్లి చేసుకున్నారు. భర్తలు చవటలు అయితే.. ఆడవాళ్లు నిర్ణయాలు అమలు చేయడంలో తప్పు లేదు. నా కొడుకులు సమర్థులు. అందుకే నీ పరువు తీయడం ఇష్టం లేక మౌనంగా నిలబడ్డాడు. ఇంత పెద్ద నిర్ణయం ఎవరి అనుమతి తీసుకున్నావ్? కనీసం వాళ్ళిద్దరినీ అయినా కనుక్కున్నావా? సీతారామయ్య అంటే.. నువ్వు చెప్పు కావ్యా.. రాజ్ కి విడాకులు ఇవ్వడం నీకు సమ్మతమేనా.. అని ఇందిరా దేవి అడుగుతుంది.

అత్తని లాజిక్‌తో కొట్టిన అపర్ణ..

చాలా సంతోషంగా ఉంది.. అమ్మమ్మ, తాతయ్య. కనీసం మీరైనా నన్ను ఈ ఇంట్లో ఒక మనిషిగా గుర్తించారు. ఈ ఇంట్లో నా ఉనికి ఒక ప్రశ్నార్థకంగా కనిపించింది. నా కంటూ ఎలాంటి అధికారం, మనసు లేదా.. మా అత్తగారు ఒక చారిత్రకమైనా నిర్ణయం తీసుకునే ముందు.. నేను కూడా ఒక సాటి ఆడదాన్ని అని గుర్తించడమే మర్చిపోయారు. నేను మా ఆయన సవ్యంగా కాపురం చేసుకోవడం లేదని.. విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నారు. మాకు పెళ్లి అయి.. ఏడాది అయ్యింది. ఆ బిడ్డ పుట్టి 9 నెలలు అయ్యాయి. అంటే అప్పుడు వాళ్ల పరిచయం అయి.. రెండు ఏళ్లు అయ్యాయి. మీ కొడుకే గనుక మాయని ఇష్ట పడితే.. అంత రహస్యంగా కాపురం చేయాల్సిన అవసరం ఏంటి? ఆమెని, ఆమె బిడ్డని ఎందుకు దూరంగా ఉంచారు? మాయే ఉంటే మా అక్కనే చేసుకుంటానని ఎందుకు అంటారు? ఆ తర్వాత నా మెడలో ఎందుకు తాళి కట్టారు? సరే కుటుంబ ప్రతిష్ఠ కోసం దాచి ఉంచవచ్చు. మరి అందులో నా తప్పు ఉందా? ఆయన చేసిన తప్పుకుని నేనేందుకు విడాకులు తీసుకుని వెళ్లిపోవాలి? మీ కొడుకు చేసిన తప్పుకు..కోడాలికి శిక్ష వేస్తారా? అని అపర్ణను ప్రశ్నిస్తుంది కావ్య. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.