ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ మాట్లాడిన దానికి సుభాష్ ఆలోచిస్తూ.. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు వల్ల నా కొడుకు బలి అవుతున్నారు. నేను చేసిన తప్పుకు ఇప్పుడు అపర్ణ ఇంట్లోంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. కానీ రాజ్ వెళ్లిపోతే.. ఇంట్లో, ఆఫీస్‌లో చాలా సమస్యలు వస్తాయి. నా వల్ల రాజ్ చాలా అవమానాలు పడుతున్నాడు. నేనే ఏదో నిజం చెప్పేసి.. కావాలంటే అపర్ణ కాళ్లు పట్టుకుని అయినా బ్రతిమలాడతాను అని అంటాడు. ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ తనకు మాత్రం నిజం చెప్పేస్తాను అని సుభాష్ అనుకుంటాడు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు స్వప్న కొట్టిన దెబ్బలను గుర్తుకు తెచ్చుకుని బాధ పడుతూ ఉంటారు. అది నిద్రలో చేయలేదు. కావాలనే చేసిందని రాహుల్ అంటాడు. ఈ దెబ్బలది ఏముందిరా.. అసలైన ఘట్టం ముందు ఉంది. ఈ రోజు రాజ్ నిజం చెప్పకపోతే.. వదిన ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అందిరా.. ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదా అని రుద్రాణి అంటుంది.
ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమైన రాజ్..
ఇక తెల్లవారుతుంది. రాజ్ బ్యాగ్, బిడ్డను పట్టుకుని.. కిందకు దిగుతూ ఉంటాడు. అప్పటికే హాలులో అందరూ కూర్చుని ఉంటారు. రాజ్ కిందుకు దిగడంతోనే.. అర్థమైందిరా నువ్వు నీ ప్రాణం పోయినా.. నిజం చెప్పవని నాకు తెలుసు. నా వల్ల నువ్వు ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోవడం, పేరు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే వెళ్లిపోతున్నాను అని రాజ్ అంటాడు. ఆ బిడ్డ కోసం నీ సర్వస్వాన్ని ధార పోసి వెళ్లిపోగలవని పూర్తిగా అర్థమై పోయిందిరా.. నిన్ను ఇంట్లోంచి పంపిస్తే నిజం బయట పెడతావని అనుకున్నా.. కానీ నువ్వు ఎక్కడ బయట పడటం లేదు. అవునులే నీ ఒంట్లో నా ఒంట్లో ఒకటే రక్తం ప్రవహిస్తోంది కదా.. అందుకు ఇంత పంతంగా ఉన్నావ్. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే.. ఈ ఇల్లు నన్ను ఓ దోషిలా చేస్తుంది. అందరూ ధర్మాసనం మీద నిలబడి తీర్పు చెప్పడం మొదలు పెడతారు. అందుకే నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బ్యాగ్ పట్టుకుని బయటకు వస్తుంది అపర్ణ.
నిజం చెప్పేందుకు సిద్ధమైన సుభాష్..
అపర్ణ వెళ్లిపోతుంటే.. ఒక్క నిమిషం అపర్ణా అని సుభాష్ అంటాడు. నువ్వు వెళ్లిపోయే ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలని చెప్తాడు. రాజ్ తప్పు చేశాడని, నిజం దాచి పెడుతున్నాడన్న కోపంతో నువ్వు వెళ్లిపోతున్నావ్.. తప్పా.. ఎందుకు వాడు నోరు విప్పడం లేదని, దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో నీకు తెలుసా? ఎందుకు నిజం చెప్పడం లేదో ఆలోచించావా అని సుభాష్ అడుగుతాడు. ఆ నిజం ఏంటో మీకు తెలుసా? ఆ బిడ్డ తల్లి ఎవరో మీకు తెలుసా? అని అపర్ణ అడుగుతుంది. అసలు ఇవాళ్టితో ఈ రహస్యం బద్ధలైపోవాలి అని సుభాష్ అంటాడు. సుభాష్ ఎక్కడ నిజం చెప్పేస్తాడేమో అని కావ్య, రాజ్‌లు కంగారు పడుతూ ఉంటారు.
సుభాష్‌ని ఆపిన కావ్య…
వెంటనే కావ్య.. మావయ్య గారూ మీరు ఆగండి అని అంటుంది. అందరూ ఒక్క నిమిషం కావ్య వైపు చూస్తారు. మావయ్య గారూ నేను అడగాల్సినవి చాలా ఉన్నాయి. మీ అబ్బాయిని, మిమ్మల్ని, మా అత్తగార్ని చాలా అడగాలి అని అంటుంది. నేను ఈ నిజం చెప్పి తీరాలని సుభాష్ అంటే.. కావ్య ఆపుతుంది. ఏం చెప్తారు? మీ అబ్బాయి గుణవంతుడు అని చెప్తారా? కట్టుకున్న పెళ్లాన్ని వదిలేసి పోతుంటే.. అప్పుడు మీరేం చెప్పలేదేంటండి? మీ భార్య వెళ్లిపోతుంటే మాత్రం ముందుకు వచ్చారా? ఇదెక్కడి న్యాయం మావయ్య గారూ.. అని కావ్య అంటుంది. మీ కొడుకుతోనూ, మీతోనూ తర్వాత నేను మాట్లాడతాను. ముందు మా అత్తగారితో తర్వాత మాట్లాడతాను.
నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి..
మా అత్తగారితో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. తేల్చుకోనివ్వండి.. అని కావ్య అంటుంది. ఏంటి నువ్వు తేల్చుకోవాల్సిన లెక్కలు? నువ్వంటేనే లెక్కలేని నన్ను పట్టుకుని ఏం లెక్కలు అడుగుతావ్? అని అపర్ణ అంటుంది. మీరు ఏదన్నా సాధించి గర్వంతో వెళ్తున్నారా? ఈ ఓడిపోయిన వాళ్ల మధ్య ఉండలేక గెలిచిన మీరు అతిశయంతో వెళ్తున్నారా? నేనంటేనే లెక్కలేని మిమ్మల్ని నేను కొన్ని లెక్కలు అడగాల్సిన సమయం వచ్చింది. అసలు మీరు ఎందుకు వెళ్లిపోతున్నారు అండి? నిజానికి మీరు ఓడిపోయి.. ఎవరికీ మొహం చూపించలేక వెళ్లిపోతున్నారు అవునా అని కావ్య అంటే.. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్? అని అపర్ణ అంటుంది.
కావ్య రాక్స్.. రుద్రాణి షాక్స్..
ఎలాగో వెళ్లిపోతుంది కదా.. ఏమీ చేయదులే అని కడుపులో ఉన్నవన్నీ కక్కేస్తున్నావా? కావ్యా.. మా వదినే ఓడిపోయిందని ఎద్దేవా చేస్తున్నావా? అని రుద్రాణి అడుగుతుంది. ఏయ్ రుద్రాణి అని కోపంతో పేరు పెట్టి పిలుస్తుంది కావ్య. ఇది మా అత్తాకోడళ్ల విషయం అని అంటే.. మధ్యలో స్వప్న సపోర్ట్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు ఈ అపర్ణ ఓడిపోయిందా? అని అడుగుతుంది. చెప్పండి మరి గెలిచారా? మీ భర్తకు, ఈ ఇంటి కోడలిగా తప్పుకుని గెలిచారా? ఒక్క విషయంలో అయినా రుజువు చేయండి. నేను ఇంటికి వచ్చి సంవత్సరం అయింది. ఏదో ఒక మూల ఆయన తప్పు చేయలేదనే నమ్మకం ఉంది. కానీ మీరు పాతికేళ్లుగా పెంచారు. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదు. ఏదో ఒకటి చేసి.. అప్పుడు గెలిస్తే ఓ లెక్క. అలాంటిది ఏమీ లేకుండా వెళ్లిపోతున్నారు. వెళ్లిపోతే వెళ్లిపోండి.. మీకు ధైర్యం లేదని, ఒప్పుకుని వెళ్లండి.
నిజాన్ని బయట పెట్టే సత్తా నీలో ఉందా…
మధ్యలో కళావతి ఏంటిది? మా అమ్మనే ఎదిరించి మాట్లాడతావా? అని రాజ్ అడుగుతాడు. మీ అమ్మగారు వెళ్లిపోమనగానే నన్ను ఇక్కడే దిక్కు లేని దానిలా వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు కదా? మీకు నన్ను అనే రైట్ లేదు. మిమ్మల్ని దులిపేసే టైమ్‌లో మిమ్మల్ని దులిపేస్తాను. అంతవరకూ ఆగండి అని కావ్య అంటుంది. ఏయ్ నువ్వేంటి మమ్మల్ని నిలదీసేది. ఇప్పటివరకూ పిల్లి కూనలా పడి ఉండే దానివి. నీకు కూడా నోరు లేస్తుందే అని అపర్ణ అంటుంది. కదా.. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ రుద్రాణి.. రాజ మాత అనుకుంటుంది. ఆ ధాన్య లక్ష్మి గారూ ఏకచక్రధాపత్యంలా ఏలేద్దాం అనుకుంటారు. ఆ అనామిక ఈ ఇంటికి మహారాణిలా అనుకుని.. కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటుంది. మీరు వెళ్లిపోతే నిజం బయట పడుతుందా? అందరూ ఇక్కడే ఉంటారు. కానీ నిజం బయట పడదని కావ్య అంటుంది. సరే నేను ఓడానో.. గెలిచానో.. అవన్నీ పక్కన పెడదాం. నేను ఉంటాను.. ఇక్కడే ఉంటాను. మరి నిజాన్ని బయట పెట్టే సత్తా నీలో ఉందా? అని అపర్ణ అడుగుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.