Most Recent

Actor Brahmaji: సార్.. మరీ ఎక్కడ తినమంటారు.. ? నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ట్వీట్.. ఎందుకంటే.

Actor Brahmaji: సార్.. మరీ ఎక్కడ తినమంటారు.. ? నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ట్వీట్.. ఎందుకంటే.

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని నటుడు బ్రహ్మాజీ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటనపై ఆసక్తితో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా మారారు. కానీ మళ్లీ సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు, కమెడియన్ గా నటిస్తూ అడియన్స్ కు దగ్గరయ్యారు. సినిమాల్లో తనదైన నటనతో అలరించే బ్రహ్మాజీ నిజ జీవితంలోనూ అంతే పాజిటివ్ యాటిట్యూడ్‏తో కనిపిస్తారు. సినీ ఈవెంట్స్, రియాల్టీ షోలలో కామెడీ టైమింగ్‏తో నవ్విస్తుంటారు. ఇక ఇప్పుడు సినిమాలతోపాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే సెలబ్రెటీలకు సంబంధించిన ట్వీట్స్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతుంది. తాజాగా బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇటీవల హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని పాపులర్ రెస్టారెంట్స్, కేఫ్ లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. చాలా ఫేమస్ అయిన హోటల్స్, రెస్టారెంట్లలో పాడైన ఆహారం.. కల్తీ నిల్వ ఆహారాన్ని గుర్తించారు. అలాగే కాలం చెల్లిన పదార్థాలతో ఫుడ్ ప్రీపేర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇక ఆ ట్వీట్ పై నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ.. “సర్.. మరి ఎక్కడ తినమంటారు. ? ఇంట్లోనా” అంటూ తన స్టైల్లో అడిగారు. ప్రస్తుతం బ్రహ్మాజీ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

ఇండస్ట్రీలో అవకాశాల వెతుకుతున్న సమయంలో బ్రహ్మాజీకి డైరెక్టర్ కృష్ణవంశీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఆఫర్స్ కోసం వెతికారు. కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడుతా సినిమాలో బ్రహ్మాజీ కీలకపాత్ర పోషించాడు. ఈ మూవీ హిట్ అయిన తర్వాత బ్రహ్మాజీని హీరోగా పెట్టి సింధూరం మూవీ తెరకెక్కించారు. ఇందులో మాస్ మాహారాజా రవితేజ కూడా మరో హీరోగా నటించారు.ఈ మూవీ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు బ్రహ్మాజీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.