అటు తమిళ్ సినిమాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ గా గడిపేస్తున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ నుంచి లేడీ విలన్ గా మారిన ఈ అమ్మడు.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరో వైపు హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఇటీవలే హనుమాన్ సినిమాలో హీరో సిస్టర్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు శబరీ అనే సినిమా చేస్తుంది. మహర్షి కండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్ర నాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 3న శబరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకుంది ఈ చిన్నది. అలాగే త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనుంది వరలక్ష్మీ. ఇదిలా ఉంటే శబరీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ చిన్నది. ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇలాంటి సినిమా ఇంతకు ముందు నేను చెయ్యలేదు. ఈ సినిమాలో నేను మదర్ గా నటిస్తున్నా.. ఈ సినిమాలో ఓ తల్లి కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథాంశం.. సైకాలజికల్ థ్రిల్లర్‌గా మార్చే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ. నేను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను. అది నా జీవితంలోనే మర్చిపోలేని గాయం. చాలా మంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా మంది సన్నిహితులకు, బందువులకు చెప్పకుండా దాచేస్తున్నారు. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. కుటుంబసభ్యులతో నీ సమస్యల గురించి మాట్లాడితే మనల్నే జడ్జ్ చేస్తారు. అదే థెరపిస్ట్ ఉంటే మన సమస్య గురుంచి వల్లే చెప్తారు అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.