తానీషా ముఖర్జీ.. చాలా మంది తెలుగు ఆడియన్స్ కు తెలియకపోవచ్చు కానీ హిందీ ఆడియన్స్ కు మాత్రం బాగానే గుర్తుంటుంది. ఈ చిన్నది తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించింది. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. ఇక తారక్ నటించిన కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కంత్రి సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే హిందీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో జరిగిన భయానక సంఘటనలను గుర్తు చేసుకుంది ఈ అమ్మడు.
సినిమా షూటింగ్ సమయంలో నటీ నటులు గాయపడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు గాయాల పాలై హాస్పటల్ లో కూడా చేరారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా షూటింగ్స్ లో గాయపడ్డారు. అలాగే తానీషా ముఖర్జీ కూడా ఓ షూటింగ్ సామయంలో తీవ్రంగా గాయపడింది. తన మొదటి సినిమా ‘ష్’ షూటింగ్ లో ఓ కొండపై నుంచి కిందపడ్డానని తెలిపింది.
తానీషా ముఖర్జీ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా సమయంలో నేను షూటింగ్ చేస్తూ ఓ ఎత్తైన కొండపై నుంచి కిందకు పడ్డాను. ఆ సమయంలో నా తలకు గాయం అయ్యింది. డాక్టర్స్ నా మెదడుకు గాయం అయ్యిందని తెలిపారు. ఏడాదిపాటు రెగ్యులర్‌గా ఆస్పత్రికి వెళ్తూ ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఒక సంవత్సరం పట్టింది. అయితే నామెదడుకు గాయం అయ్యిందని ఎవ్వరికి చెప్పలేదు. అసలే మొదటి సినిమా నన్ను ఎక్కడ తీసేస్తారో అని చెప్పలేదు. కానీ ఆ బాధతోనే షూటింగ్ లో పాల్గొన్నా.. అయితే బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా కనిపించలేక పోయాను. చాలా సన్నివేశాల్లో ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా పలికించలేకపోయాను.. దాంతో చాలా మంది నాకు నటన రాదు అని విమర్శించారు, కానీ వారికి నా గాయం గురించి తెలియదు కదా అని చెప్పుకొచ్చింది తానీషా ముఖర్జీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.