Most Recent

Siddharth: అలా చెప్పడం నిజంగానే సిగ్గుచేటు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరో సిద్ధార్థ్..

Siddharth: అలా చెప్పడం నిజంగానే సిగ్గుచేటు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరో సిద్ధార్థ్..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ సిద్ధార్థ్. ఓయ్ సినిమాతో మొదలైన ప్రయాణంలో ఎన్నో హిట్స్ అందుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అళరిస్తున్నారు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు వంటి హిట్స్ అందుకున్న సిద్దార్థ్.. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇటు తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉన్న సిద్ధార్థ్.. ఇటీవలే మహాసముద్రం సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ కూడా నిరాశపరచడంతో తిరిగి కోలీవుడ్ షిఫ్ట్ అయ్యాడు. కొద్ది రోజుల క్రితం చిత్తా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ సినిమాను తెలుగులో చిన్నా పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మాత్రం అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో సైతం సిద్దూకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా తమిళనాడులో జరిగిన అవార్డు ఫంక్షన్లో చిత్తా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు సిద్దార్థ్.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో చిత్తా చిత్రానికి గానూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమాను చూసి డిస్టర్బ్ అయ్యామంటూ పలువురు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల హిట్ అియన బాలీవుడ్ సినిమాకు కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారన్నారు. మనసుని హత్తుకునే కథతో సినిమా చేస్తే మాత్రం చాలా మంది ఇబ్బందిగా అనిపించింది అంటున్నారని.. సినిమా చూడలేకపోయామని కామెంట్స్ చేయడం నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం అని అన్నారు. చిత్తా సినిమాకు మృగం అని పెడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేవారన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా సినిమాలో సిద్ధార్థ్, నిమిషా సజయన్, బేబీ సహస్త్ర ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. సిద్ధార్థ్ సొంత బ్యానర్ అయిన ఎటాకి ఎంటర్టైన్మెంట్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.