సలార్ ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 700 కోట్లకుపైగా రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సలార్ సెకండ్ పార్ట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సలార్ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా సందడి చేయనుంది. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం స్టార్ మాలో సాయంత్రం 5.30 గంటలకు సినిమా టెలికాస్ట్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అభిమానులకు ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది.
సలార్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని అభిమానులకు అందించింది చిత్ర నిర్మాణం సంస్థ హోంబలే ఫిలిమ్. ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేవలం ఒక చిన్న ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఇంతకీ బైక్‌ను గెలుచుకోవడానికి ఏం చేయాలన్న విషయాన్ని వివరిస్తూ ఓ ట్వీట్ చేసింది.
Here’s your exclusive opportunity to win the same iconic motorcycle ridden by Rebel Star #Prabhas in #SalaarCeaseFire.
All you need to do is count the number of times the bike image/bug appears on the left of the screen during the movie from 5:30 PM to 8 PM. When the SMS lines… pic.twitter.com/WYMJ8FANqj
— Hombale Films (@hombalefilms) April 18, 2024
స్టార్ మాలో సినిమా టెలికాస్ట్ అవుతున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా పూర్తయ్యేలోపు ఆ బైక్ ఎన్నిసార్లు కనిపించిందో సరిగ్గా చెప్తే బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. సినిమా పూర్తయిన వెంటనే ఎస్సెమ్మెస్ లైన్లు ప్రారంభమౌతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఈ ఎస్సెమ్మెస్‌లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి పంపించాల్సి ఉంటుంది. దీంతో సలార్‌లో ప్రభాస్ ఉపయోగించిన బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..