Most Recent

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ వార్నర్.. యాక్టింగ్ చూసి దడుసుకున్న జక్కన్న.. హర్ట్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్..

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ వార్నర్.. యాక్టింగ్ చూసి దడుసుకున్న జక్కన్న.. హర్ట్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ థియేటర్లలో రికార్డ్స్ సృష్టించాడు డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈసినిమాపై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని గతంలోనే వెల్లడించారు జక్కన్న. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ కాగా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్, జక్కన్న కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అభిమానులకు ఇప్పుడు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. మహేష్ తో సినిమా వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏కు డెవిడ్ వార్నర్ వీడియోను రిలీజ్ చేసి చూపించాడు. జక్కన్న డైరెక్షన్లో డెవిడ్ వార్నర్‏ను చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్. కానీ వీరిద్దరు కలిసింది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ కోసం. అసలు విషయానికి వస్తే..

ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. అందులో దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించారు. ఇప్పుడు ఈ ఫన్నీ యాడ్ తెగ వైరలవుతుంది. అందులో ముందుగా జక్కన్న క్రికెట్ మ్యాచ్ టికెట్ కౌంటర్ బయట నిల్చొని వార్నర్ కు ఫోన్ చేస్తాడు. “డేవిడ్ గారు.. మీ మ్యాచ్ టికెట్స్ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా ? ” అని జక్కన్న అడగ్గా.. వార్నర్ మాట్లాడుతూ… “రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది”. మరి నార్మల్ యూపీఐ అయితే రాజమౌళి అడిగితే.. ” అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ అడుగుతాడు. మీ డైరెక్షన్లో నాకు ఓ ఛాన్స్ ఇవ్వాలని అడుగుతాడు వార్నర్.. దీంతో వార్నర్ తన డైరెక్షన్లో నటిస్తే ఏమవుతుందో జక్కన్న ఊహించుకుంటాడు. సెట్స్ లో ఓవరాక్షన్, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిని ఊహించుకోని జడుసుకుంటాడు. మీకు ఛాన్స్ ఇవ్వడం కంటే క్రెడ్ యూపీఐ కి అప్ గ్రేడ్ అవడమే బెటర్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఈ ఫన్నీ యాడ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

అయితే ఈ వీడియో పై ఇప్పుడు నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. రాజమౌళి డైరెక్షన్లో నటించాలని స్టార్ హీరోస్ సైతం ఎదురుచూస్తుంటారు. కానీ వార్నర్ మాత్రం తన నటనతో జక్కన్నకే దడ పుట్టించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై మహేష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 ఎప్పుడూ స్టార్ట్ చేస్తారని ? అప్డేట్స్ ఇస్తారా ? మహేష్ మూవీ చేస్తారనుకుంటే వార్నర్ తో యాడ్ చేస్తున్నారా ? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వార్నర్ ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.