Most Recent

Pushpa 2: ‏చేతిలో గొడ్డలి.. సింహాసనంపై పుష్పరాజ్.. టీజర్ పై మాస్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Pushpa 2: ‏చేతిలో గొడ్డలి.. సింహాసనంపై పుష్పరాజ్.. టీజర్ పై మాస్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా అడియన్స్ ఈ మూవీ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక లుక్.. ఫహాద్ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. కానీ ఇప్పటివరకు టీజర్ కాలేదు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రివీల్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు బన్నీ బర్త్ డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఈరోజు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తూ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఈరోజు పుష్ప 2 ది రూల్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో గత రెండుమూడు రోజులుగా పుష్ప 2 నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక నిన్న పుష్ప 2 టీజర్ పై అప్డేట్ ఇస్తూ మేకర్స్ రివీల్ చేసిన బన్నీ పోస్టర్ అదిరిపోయింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ఈరోజు ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సింహాసనంలో బన్నీ కుర్చొని ఉండగా.. కుడి చేతిలో గొడ్డలి పట్టుకుని కుర్చున్న విధానం చూస్తే ఈసారి మరింత మాస్ యాక్షన్‏తో రఫ్పాడించేందుకు బన్నీ రెడీ అయినట్లు తెలుస్తోంది. రంగు రంగుల చొక్కా.. లుంగీ.. మెడలో బంగారు గొలుసులు.. వేళ్లకు ఉంగరాలు.. చేతికి కడియాలు.. కాళ్లకు బెల్టు చెప్పులు ధరించి ఊర మాస్ పుష్ప రాజ్ ను చూపించగా.. అతడు కుర్చీలో కూర్చున్న తీరు చూస్తుంటే…స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక బన్నీ వెనుకే ఉన్న సైన్యం అంతే మాసీవ్ గా కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో టీజర్ రిలీజ్ చేయనున్నారు.

డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబోలో వస్తో్న్న పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.