పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మలయాళ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో సలార్ సినిమా చేశాడు. ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ఇప్పుడు హిందీలోనూ నటిస్తున్నారు. ‘బడే మియా చోటే మియా’ సినిమాలో విలన్ గా నటిస్తుంన్నాడు. ఈ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ‘బడే మియా చోటే మియా’ సినిమాను అంగీకరించడానికి ప్రశాంత్ నీల్ కారణమని చెప్పుకొచ్చాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘సలార్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘బడే మియా చోటే మియా’ మూవీలో నటించమని పృథ్వీరాజ్‌కి చెప్పారట.. ఈ విషయం గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ. సలార్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ టైంలో నేను అలీ అబ్బాస్ జాఫర్ రాసిన స్క్రిప్ట్ గురించి ప్రశాంత్ నీల్‌తో మాట్లాడుతున్నాను. నాకు బడే మియా చోటే మియా సినిమా ఆఫర్ వచ్చింది. పాత్ర కూడా బాగుంది. అయితే డేట్స్ కుదరకపోవడంతో సినిమా చేయడం లేదని ప్రశాంత్‌తో చెప్పాను’ అని పృథ్వీరాజ్ తెలిపారు.
ప్రశాంత్ నీల్‌తో సినిమా గురించి, స్క్రిప్ట్ గురించి 20 నిమిషాలు మాట్లాడాను. ఈ సినిమా నువ్వే చేయాలి అన్నాడు. నేను ఈ సినిమాలో నటించకపోతే.. సినిమా చూసిన తర్వాత చాలా బాధపడతావ్’ అన్నారు. మొత్తానికి పృథ్వీరాజ్ ‘సలార్’, ‘సర్జామీన్’, ‘బడే మియా చోటే మియా’ చిత్రాల్లో నటించారు. దీని కోసం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘నేను ఒకేసారి రెండు సినిమాలు చేయను. మలయాళ సినిమాకు ఓ సంప్రదాయం ఉంది. ఒక సినిమా స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యే వరకు ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉంటాం. అందరూ నా కోసం అడ్జస్ట్ అయ్యారు. అందుకే మంచి సినిమా చేయగలిగాను’ అన్నారు పృథ్వీరాజ్ తెలిపాడు. ‘బడే మియా చోటే మియా సినిమా ఏప్రిల్ 10న విడుదలవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.