Most Recent

Pawan Kalyan: పవన్ ఓజీ విషయంలో అవన్నీ రూమర్స్ మాత్రమే.. అసలు విషయం ఏంటంటే..

Pawan Kalyan: పవన్ ఓజీ విషయంలో అవన్నీ రూమర్స్ మాత్రమే.. అసలు విషయం ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఏపీ లో ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పవన్ కళ్యాణ్ వరుసగా సభలు , పర్యటనలతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ లైనప్ చేసిన సినిమాలు పై అభిమానుల్లో రకరకాల అనుమానాలు మొదలవుతున్నాయి. అసలు ఎన్ని సినిమాలు పట్టాలెక్కుతాయి.? ఎన్ని ఆగిపోతాయి.? అనే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పవన్ ఎమ్మెల్యే అవుతారు. మరి ఆతర్వాత సినిమాలు చేస్తారా.? లేదా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ నటిస్తున్న ఓజీ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తుంది.

ఓజీ సినిమా షూటింగ్ కు పవన్ బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ఇవ్వనున్నారట. పోలింగ్ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అదికేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది.

పోలింగ్ తర్వాత పవన్ ఓజీ షూటింగ్ లో జాయిన్ అవుతారన్నది నిజం కాదు అని.. ఎన్నికలు పూర్తయ్యి.. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పవన్ ఓజీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారని తెలుస్తోంది. పవన్ ఇంకా 15 రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉంచారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలతో బిజీగా కానున్నారు. ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే  ఈ మూవీ నుంచి మారిన్ క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.