Most Recent

Nithin- Nikhil : ఇద్దరు యంగ్ హీరోలు ఓకే ఫ్రేమ్‌లో.. నితిన్, నిఖిల్ కలిసి నటించిన సినిమా ఎదో తెలుసా..

Nithin- Nikhil : ఇద్దరు యంగ్ హీరోలు ఓకే ఫ్రేమ్‌లో.. నితిన్, నిఖిల్ కలిసి నటించిన సినిమా ఎదో తెలుసా..

టాలీవుడ్ లో యంగ్ హీరోలు నిఖిల్, నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత నిఖిల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సోలో హీరోగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కథల విషయంలో నిఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వామి రారా.., కార్తికేయ , కార్తికేయ 2, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం, 18 పేజెస్ ఇలా వరుస హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు స్వయంభు ఆమె పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. అలాగే మరో సినిమా కూడా చేస్తున్నాడు నిఖిల్. అలాగే మరో యంగ్ హీరో నితిన్ కూడా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు.

నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా తర్వాత అంతగా హిట్ అందుకోలేకపోయాడు నితిన్. కాగా మొన్నీమధ్య ఎక్స్ ట్రా ఆర్డనరీ మెన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే ఓ సినిమాలో నిఖిల్, నితిన్ కలిసి నటించారు. ఈ విశ్శ్యామ్ చాలా తక్కువ మందికి తెలుసు. నిఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలాగే నితిన్ హీరోగా నటించిన సంబరం అనే సినిమాలోనూ కనిపిస్తాడు. నితిన్ పరధ్యానంగా రోడ్డు పై వెళ్తుంటే.. సడన్ గా కారులో వస్తాడు నిఖిల్. ఒరేయ్ మామా చూసుకొని వెళ్ళారా..? అని అంటాడు. ఇలా ఈ యంగ్ హీరోలు ఇద్దరూ కలిసి నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Lyf A Zindagi (@lyf_a_zindagi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.