లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. అయితే తాము తయారు చేసిన కరోనా వైరస్ టీకా కోవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం జరుగుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ కోర్టుకు ఆస్ట్రాజెన్కా పేర్కొన్నట్లు నివేదించింది. ఈ కోవిషీల్డ్ టీకాను పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాను దేశంలో విస్తృతంగా వినియోగించిన సంగతి తెలిసిందే. ఈ టీకా అనేక సందర్భాల్లో మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని ఆరోపిస్తూ హైకోర్టులో దాదాపు 51 కేసులు నమోదయ్యాయి. దీంతో సదరు బాధితులు మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు భయాందోళనకు గురవుతున్నారు. నెట్టింట కొందరు కోవిషీల్డ్ టీకా గురించి అవగాహన కల్పిస్తుండగా.. మరికొందరు ఈ వ్యాక్సిన ఆకస్మిక మరణానికి కారణమవుతుందంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. తాజాగా ఇలాంటి వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ గురించి వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు.
“కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఎలాంటి ఆందోళన చెందకండి. వ్యాక్సిన్ పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు. వ్యాక్సిన్ భయం కంటే ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుంది. ప్రశాంతంగా ఉండండి.. ప్రస్తుత క్షణాన్ని ఆనందించండి” అంటూ రాసుకొచ్చారు.
For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG
— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.