Most Recent

Allu Arjun: అల్లు అర్జున్ డెడికేషన్ నెక్ట్స్ లెవల్.. ఆ ఐకానిక్ షాట్ కోసం ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలుసా

Allu Arjun: అల్లు అర్జున్ డెడికేషన్ నెక్ట్స్ లెవల్.. ఆ ఐకానిక్ షాట్ కోసం ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలుసా

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న పుష్ప: ది రూల్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా  టీజర్ విడుదల కాగా, అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చిత్రబృందం స్పెషల్ టీజర్ ను విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా టీజర్ లో జాతర లుక్ అందర్నీ ఆకట్టుకుంది. అయితే అల్లు అర్జున్ ఓ షాట్ కోసం 51 టేకులు తీసుకున్నట్లు టాక్.

అయితే ఆ షాట్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని సమాచారం. చీర ధరించి తాండవ్ ను ప్రదర్శిస్తూ కనిపించాడు. ఈ లుక్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క నిమిషం టీజర్ ని కరెక్ట్ గా తీయడానికి పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అయితే టీజర్ కోసం ఓపికగా షూట్ చేసిన అల్లు అర్జున్ పర్ఫెక్ట్ షాట్ కోసం 51 టేకులు తీసుకున్నాడు.  ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని, ఆలోచనలో చాలా స్పష్టత ఉన్న వ్యక్తి అని ఈ చిత్రానికి పనిచేస్తున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ డెడికేషన్ లెవల్స్ ను ప్రశంసించిన రసూల్ ప్రస్తుత కాలంలోని బెస్ట్ స్టార్స్ లో ఒకడని కొనియాడాడు.

సుకుమార్ దర్శకత్వంలో సునీల్, అనసూయ, రష్మిక, ఫహద్ తదితరులు నటించిన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించడంతో పార్ట్ 2 భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదల దగ్గర సమీపిస్తుండటంతో పుష్ప ఫ్యాన్స్ మరిన్ని అప్డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే టీజర్ ను వదిలిన మేకర్స్ రానున్న రోజుల్లో కీలక అప్డేట్లను ఇవ్వనుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.