Most Recent

Tripti Dimri : త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది.. ఎందుకంటే.. యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్..

Tripti Dimri : త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది.. ఎందుకంటే.. యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్..

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, సిద్దాంత్ కర్ణిక్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీస్ ఈ మూవీపై సంచలనం వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావుతోపాటు మరికొందరు ప్రముఖులు ఈ మూవీని విమర్శలు గుప్పించారు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి సైతం యానిమల్ సినిమాపై వస్తున్న విమర్శలకు గట్టిగానే కౌంటర్స్ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు మాత్రం అడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అటు మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా హిట్ అయ్యింది. ఇక ఇందులో జోయా పాత్రలో కనిపించిన బాలీవుడ్ తార త్రిప్తి డిమ్రి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ అయినా.. రణబీర్ ప్రియురాలు జోయా పాత్రలో మెప్పించింది త్రిప్తి. ఇందులో వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి గ్లామరస్ లుక్స్‏తో కట్టిపడేసింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా నెట్టింట మారుమోగింది. జోయా పాత్రతో త్రిప్తి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఈసినిమాతో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్‏గా మారిపోయింది. యానిమల్ సినిమా తర్వాత త్రిప్తికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ బావ వరుణ్ ప్రతాప్ మల్హోత్రా పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్ణిక్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన త్రిప్తి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. యానిమల్ సినిమాలోని జోయాతో తనకు డేటింగ్ చేయాలని ఉందని వెల్లడించారు. అందుకు కారణం కూడా వివరించారు. తన మాటలను వివాదంగా చూడొద్దని అన్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నానని.. తృప్తిని కాఫీ కోసం బయటకు తీసుకెళ్లాలని.. తనకోసం సంతోషంగా బిల్లు చెల్లిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని అన్నారు.  సిద్ధాంత్ కర్ణిక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సిద్ధాంత్ కర్ణిక్.. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ చిత్రాల్లో నటించారు. అంతకు ముందు బుల్లితెరపై అనేక సీరియల్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.