Most Recent

Tollywood: తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ క్రష్.. కానీ జీవితంలో ఊహించని కష్టాలను చూసిన హీరోయిన్.. ఎవరో తెలుసా ?…

Tollywood: తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ క్రష్.. కానీ జీవితంలో ఊహించని కష్టాలను చూసిన హీరోయిన్.. ఎవరో తెలుసా ?…

తెలుగులో తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దొచేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక అభిమానులు ఉన్న హీరోయిన్లలో ఈ కేరళ కుట్టి ఒకరు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె జీవితంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. అనుకోని సంఘటనతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఆ ఘటన తర్వాత ఈ బ్యూటీ సినీ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పటికీ తన జీవితాన్ని చిదిమేసిన ఘటనపై న్యాయపోరాటం చేస్తుంది. కొన్నాళ్లపాటు మానసిక సంఘర్షణతో ఒంటరిగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన్ రెండు ఫోటోలను చూశారు కదా.. ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ సూపర్ హిట్. ఇంతక ఆమె ఎవరంటే మలయాళీ కుట్టి భావన.

భావన.. బేసుతడి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే అజిత్ జోడిగా కనిపించింది. భావన అసలు పేరు కార్తికా మీనన్. కేరళలోని త్రిస్సూర్ లో జన్మించింది. నమ్మళ్ సినిమా ద్వారా 2002లో సినీ ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ్, తెలుగులో వరుస హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు దశబ్దంపాటు సాగిన ఆమె ప్రయాణంలో 70 సినిమాల్లో కనిపించింది. అంతేకాకుండా రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది. తెలుగులో శ్రీకాంత్ నటించిన మహాత్మా చిత్రంలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది భావన. ఈ సినిమా తర్వాత భావనకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.

అయితే చేతినిండా సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2017లో ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు ఆగంతకులు ఆమెను కిడ్నాపి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో మలయాళీ సూపర్ స్టార్ దిలీప్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తుంది భావన. ఈ ఘటన తర్వాత చాలాకాలం పాటు మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Bhavana🧚🏻‍♀️Mrs.June6 (@bhavzmenon)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.