ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతున్న సినిమా టిల్లు స్వ్కేర్. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు చిత్రానికి ఇది సీక్వెల్‌గా తీసుకువచ్చారు. గతంలో వచ్చిన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో.. భారీ అంచనాల మధ్య మార్చి 29న అడియన్స్ ముందుకు వచ్చింది టిల్లు స్వ్కేర్. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా అటు కలెక్షన్స్ సైతం ఎక్కువే రాబడుతున్నాయి. మొదటిరోజే దాదాపు రూ. 23 కోట్లకు పైగా వసూలు చేసింది చిత్రయూనిట్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఎప్పటిలాగే కంటెంట్ పరంగానే కాకుండా.. ఇటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది టిల్లు స్క్వేర్. ఈ వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టిల్లు స్వ్కేర్ చిత్రానికి ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… డీజే టిల్లుకు సీక్వెల్ టిల్లు స్క్వేర్ అని.. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కూడా సీక్వె్ల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. “ఈ సినిమాను కూడా డీజే టిల్లులాగా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది సినీ పరిశ్రమ వాళ్లు.. డిస్ట్రీబ్యూటర్స్, అభిమానులు కూడా దీనికి సీక్వెల్ ఉందా అని అడుగుతున్నారు. టిల్లు పార్ట్ 3 కూడా తీస్తాం. హీరో సిద్ధూ త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తాడు” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ స్థాయిలో అర్థం కానీ సినిమాలు ఇవి.. ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే నన్ను నమ్మి అత్యున్నత ప్రమాణాలతో సినిమాను తీశారు. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థాంక్స్. నటుడి కంటే ముందు రచయితను నేను. రాసేటప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. ఎక్కువ తక్కువలు కాకుండా పాత్రను రాసుకున్నాం. అనుపమ గురించి వందశాతం ఊహిస్తే.. తన నటనతో వెయ్యి శాతం ప్రభావం చూపించింది.” అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.