Most Recent

Salman Khan: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారుఖ్, అమీర్.. అంబానీ ప్రీవెడ్డింగ్‏లో ఆర్ఆర్ఆర్ మ్యాజిక్..

Salman Khan: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారుఖ్, అమీర్.. అంబానీ ప్రీవెడ్డింగ్‏లో ఆర్ఆర్ఆర్ మ్యాజిక్..

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయాన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఆయన చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. దీంతో ఇప్పుడు గుజరాత్ లోని జామ్ నగర్‏లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రెటీస్ హజరయ్యారు. మార్చి 1న ప్రారంభమైన ఈ సెలబ్రెషన్స్ నేటితో ముగియనున్నాయి. మొదటిరోజు పాప్ సింగర్ రిహాన్న తన ప్రదర్శనతో ఊర్రూతలూగించింది. మొదటిసారి భారతదేశంలో ప్రదర్శన ఇచ్చింది రిహాన్నా. ఇక రెండో రోజు జరిగిన సంగీత్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్స్‏తో సందడి చేశారు. ఇక విదేశీయులు, ఇతర దేశాల వ్యాపారవేత్తలు ఇండియన్ ట్రెడిషనల్ దుస్తులు ధరించి అదరగొట్టారు. ఇక ఈ వేడుకలలో ట్రిపుల్ ఆర్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యింది. ఈ మూవీలోని నాటు నాటు పాటకు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసి వావ్ అనిపించారు.

బీటౌన్ లెజెండ్స్.. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్ పై కలిసి కనిపించారు. వీరు ముగ్గురు కలిసి నాటు నాటు పాటకు కాలు కదిపారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టేప్ ను మార్చేసి నవ్వులు పూయించాడు సల్మాన్. ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ మూమెంట్ ఫోజు ఈ ముగ్గురు స్టార్స్ కలిసి చేయడం హైలెట్ అయ్యింది. అనంతరం పఠాన్ సినిమాలోని జూమ్ కో పఠాన్ పాటకు అదరగొట్టేశాడు షారుఖ్. చివరగా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ చయ్యా చయ్యా పాటకు పెర్ఫామెన్స్ ఇచ్చారు. సల్మాన్, షారుఖ్ బ్లాక్ కుర్తాలు ధరించగా.. అమీర్ ఖాన్ గ్రీన్ కలర్ కుర్తాలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చాలా కాలం తర్వాత వీరు ముగ్గురు కలిసి ఇలా ఒకే స్టేజ్ పై కనిపించడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. బాలీవుడ్ లోని త్రిమూర్తులు ఒకే స్టేజ్ పై నాటు నాటు పాటకు డాన్స్ చేయడం ఆనందంగా ఉందని.. హిస్టరీ క్రియేటింగ్ మూమెంట్.. ఐకానిక్ బీటౌన్ కింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ తర్వాత రణబీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఖుషీ కపూర్, సారా అలీ ఖాన్, దీపికా పదుకొణే ప్రదర్శనలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ చివరిరోజు కావడంతో ఈ వేడుకలలో ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రదర్శన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, సైనా నెహ్వాల్, హార్దిక్ పాండ్యా వంటి భారత అథ్లెట్లు పర్ఫామెన్స్ ఉండనుందని.. తెలుస్తోంది. ఇక ఇవాంకా ట్రంప్ గర్భా, దాండియా నేర్చుకుంటున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by FILMYGYAN VIDEOS (@filmygyanvideos)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.