Most Recent

Operation Valentine Review: హిట్టా.? ఫట్టా.? ఆపరేషన్ వ్యాలెంటైన్‌ కోసం వరుణ్ కష్టం ఫలించిందా.?

Operation Valentine Review: హిట్టా.? ఫట్టా.? ఆపరేషన్ వ్యాలెంటైన్‌ కోసం వరుణ్ కష్టం ఫలించిందా.?

పెద్దనాన్న చిరు, అన్న చరణ్..! అన్నీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేస్తుంటే.. వరుణ్ మాత్రం ఆ లెక్క తనకి సెట్టు కాదన్నట్టు.. వెరైటీ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. సినిమా సినిమాకి సంబంధం లేకుండా తన కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ వ్యాలెంటైన్‌తో మన ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో.. ఈ రివ్యూ లో తెలుసుకుందాం..!

ఇక ఈ సినిమా కథేంటంటే! ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ లో అర్జున్‌ దేవ్‌ అలియాస్ వరుణ్‌ తేజ్‌ వింగ్‌ కమాండర్. ఆయన ఫ్లై చేస్తున్నప్పుడు రుద్ర అనే పేరు వాడుతుంటారు. ఒక సైనికుడిగా కంటే సేవియర్ గా ఉంటాడు అర్జున్. తన కళ్ళ ముందు తోటి సైనికుడికి ఏదైనా జరిగితే తన ప్రాణం అడ్డుపెట్టి మరి కాపాడుతాడు. దీనివల్ల చాలాసార్లు చావు అంచుల వరకు వెళ్లి బయటపడతాడు. రాడర్‌ కమాండర్‌ అహ్న గిల్‌ అలియాస్ మనుషీ చిల్లర్‌ ఆదేశాలతో తన పైటర్‌ను డ్రైవ్‌ చేస్తుంటాడు. అయితే ఒకసారి ప్రాజెక్ట్ వజ్రలో భాగంగా భూమి నుంచి 20 మీటర్ల ఎత్తులో తన ఎయిర్‌ క్రాప్ట్‌ను నడిపించి శత్రువు రాడార్‌లకు చిక్కకుండా ఎటాక్‌ ప్లాన్ చేయొచ్చు అనేది టెస్ట్ చేస్తాడు. చావు దగ్గరకు వెళ్ళొస్తాడు. కానీ ఈ టెస్ట్ లో తన స్నేహితుడు మరో వింగ్‌ కమాండర్‌ కబీర్‌ అలియాస్ నవదీప్‌ ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ప్రాజెక్ట్ వజ్రని ఎయిర్‌ఫోర్స్ అధికారులు బ్యాన్‌ చేస్తారు. ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక మిషన్ పూర్తి చేసి వస్తుండగా.. ఫిబ్రవరి 14, 2019లో కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన చూస్తాడు అర్జున్‌. అప్పటికే గాల్లో ఉన్న అర్జున్ మళ్లీ ఎటాక్ చేయాలనుకుంటాడు. కానీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అభ్యంతరం చెప్పడంతో వెనుతిరుగుతాడు. ఆ తర్వాత పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది జవాన్ల ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. అందుకే బాలకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ కు ఆదేశిస్తుంది. దీన్ని బాధ్యతలను తీసుకున్న కమాండర్‌ అర్జున్‌… దీనికోసం పాకిస్థాన్‌ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్‌ క్రాస్‌ చేసి.. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తాడు. అయితే అది ఎగ్జాక్ట్‌గా ఎలా చేస్తాడు. అనేది మెయిన్ స్టోరీ..! సినిమా బిగినింగ్‌ నుంచే.. సుత్తి లేకుండా సూటిగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు శక్తి ప్రతాప్. ఆపరేషన్ వాలెంటైన్ కోసం తను రీసెర్చ్‌ చేసిందంతా.. తెరపై బాగానే చూపించాడు. ఇక సినిమాలో చపుల్వామా అటాక్స్ సీన్ ఆసక్తికరంగా ఉంది. అక్కడ్నుంచి కథ మరింత వేగంగా ముందుకెళుతుంది. అయితే ఎంతసేపు పాకిస్తాన్ మన మీద చేసిన అటాక్స్ మాత్రమే చూపించారు కానీ.. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల తాలూకు కుటుంబాల ఎమోషన్ కూడా చూపించి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఫస్టాఫ్ కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ మాత్రం బాగుంది. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ సీన్స్‌… విజువల్ గా అదిరిపోయాయి. మనవాళ్లు పాకిస్తాన్ బోర్డర్ క్రాస్‌ చేసి వాళ్ల మీద అటాక్ చేస్తున్న సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే వందేమాతరం RR అందర్లో గూస్‌ బంప్స్‌ పుట్టిస్తుంది.

ఇక యాక్టింగ్ విషయాన్ని వస్తే.. వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్ కోసం చాలా మేకోవర్ అయ్యాడు.. పర్ఫెక్ట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌గా అనిపిస్తాడు. రాడార్ వింగ్ కమాండర్ గా మానుషి చిల్లర్ కూడా బాగా నటించింది. మరో ముఖ్యమైన పాత్రలో రుహాని శర్మ ఆకట్టుకుంది. సంపత్ రాజ్, అలీ రెజా, నవదీప్ అందరూ తమ క్యారెక్టర్‌ మేరకు నటించారు. ఇక వీరందరికి తోడు.. మిక్కీ జే మేయర్‌ బీజీఎం అదిరిపోయింది. చాలా సీన్స్‌ను ఆయన బీజీఎమ్మే ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసింది. రిమైనింగ్ క్రాఫ్ట్స్‌ కూడా బాగా పనిచేశాయి. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఆపరేషన్ వాలెంటైన్.. ఓ దేశభక్తి సినిమా.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.