Most Recent

Jayalalitha: ‘శరత్ బాబుతో బిడ్డను కనాలనుకున్నా.. వారే మా పెళ్లిని చెడగొట్టారు’: సీనియర్ నటి జయలలిత

Jayalalitha: ‘శరత్ బాబుతో బిడ్డను కనాలనుకున్నా.. వారే మా పెళ్లిని చెడగొట్టారు’: సీనియర్ నటి జయలలిత

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు జయలలిత. ఆ తర్వాత స్పెషల్ రోల్స్ తోనూ సందడి చేశారు. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో కనిపించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోన్న ఈ సీనియర్ నటి ఎక్కువగా సీరియల్స్ లో నే కనిపిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే జయలలిత ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్నేళ్లకే భర్త చనిపోయినా మరో పెళ్లి కూడా చేసుకోలేదామె. తన బంధువులే తన కుటుంబీకులుగా భావించారు. తల్లిదండ్రులు కన్నుమూసిన తర్వాతే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారామె. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలితన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దివంగత నటుడు శరత్ బాబుతో పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు, బిడ్డను కూడా కనేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ‘ అమ్మానాన్న చనిపోయాక నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాను. నాకు రమా ప్రభ చాలా క్లోజ్ ఫ్రెండ్. రమా, శరత్ బాబులను అక్కా బావా అంటూ పిలిచేదాన్ని’

 

వారే మా పెళ్లి వద్దన్నారు..

‘నేను శరత్ బాబు కలిసి పలు తీర్థయాత్రలకు వెళ్లాం. ఈ క్రమంలోనే మా మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. అది చాలా కాలం పాటు కొనసాగింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. పిల్లల్ని కూడా కనాలనుకున్నాం. ఇదే విషయాన్ని సినిమా ఇండస్ట్రీలోని మా స్నేహితులకు చెప్పాం. అయితే వారు శరత్ బాబుకు వద్దని చెప్పారట. దీంతో మా పెళ్లి ఆగిపోయింది. శరత్ బాబుకు పిల్లలు అంటే కాస్త భయం ఉండేది. పైళ్లై పిల్లలు పుట్టాకా ఆస్తి కోసం తమ పిల్లల్ని ఎవరైనా ఏమైనా చేస్తారని భావించి వద్దనే వారు. ఆయన చివరి రోజుల్లో ప్రతిరోజూ ఆస్పత్రికి వెళ్లేదాన్ని. అయితే ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు దక్కలేదు ‘ అని వాపోయారు జయలలిత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.