Most Recent

Hanuman OTT: ఎట్టకేలకు ‘హనుమాన్’ ఓటీటీపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. నెటిజన్స్ రియాక్షన్ ఏంటంటే..

Hanuman OTT: ఎట్టకేలకు ‘హనుమాన్’ ఓటీటీపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. నెటిజన్స్ రియాక్షన్ ఏంటంటే..

ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హనుమాన్’. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ… ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇటీవలే 50 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమాను ఏ ఓటీటీలో రిలీజ్ చేస్తారు ?.. అసలెప్పుడు స్ట్రీమింగ్ కానుంది ?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం నడిచింది. కానీ మరోసారి ఓటీటీ మూవీ లవర్స్ కు నిరాశే ఎదురయ్యింది. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు నెటిజన్స్. ఇక ఇప్పుడు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. దీంతో నెటిజన్స్ క్రేజీ రియాక్షన్స్ వైరలవుతున్నాయి.

త్వరలోనే హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్ రానుందని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యా్న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడొస్తుంది ?.. ఏ ప్లాట్ ఫామ్ ?.. అప్డేట్ వస్తుంది కాకుండా.. నేరుగా అప్డేట్ ఇవ్వొచ్చు కదా.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. ఇంకా ఎన్నిసార్లు ఇలా చెబుతారు.. మాకు ఇంట్రెస్ట్ పోయిందన్న.. జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసినిమాను మార్చి 16న స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతవరకు ఉందనేది చూడాలి.

భారతీయ ఇతహాసాల్లోని సూపర్ హీరో హనుమాన్ పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా, అమృతా అయ్యార్ జంటగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ , సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ మేకింగ్.. వీఎఫ్ఎక్స్ విజువల్స్.. తేజా సజ్జా యాక్టింగ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మార్చి 16న జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. కానీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయో చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.