Most Recent

TV9 WITT Summit 2024: టీవీ9 గ్గోబల్‌ సమ్మిట్‌లో సందడి చేయనున్న రవీనా.. ఏ విషయాలపై మాట్లాడనున్నారంటే?

TV9 WITT Summit 2024: టీవీ9 గ్గోబల్‌ సమ్మిట్‌లో సందడి చేయనున్న రవీనా.. ఏ విషయాలపై మాట్లాడనున్నారంటే?

TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో గతేడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్ టుడే’ కార్యక్రమానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఈవెంట్‌ లో పాల్గొన్నారు. వివిధ విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వాట్ ఇండియా థింక్స్ టుడే రెండవ సీజన్‌ జరగనుంది. ఫిబ్రవరి 25 నుంచి మూడు రోజుల పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈ మెగా ఎన్ క్లేవ్‌ జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలతో సహా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, ప్రభావవంతమైన వ్యక్తులు పాల్గొననున్నారు. దేశాభివృద్ధి, రాజకీయ, సామాజిక స్థితి గతులపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ స్టార్స్ టీవీ9 సమ్మిట్‌లో భాగం కానున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి, అలనాటి అందాల తార రవీనా టాండన్ వాట్ ఇండియా థింక్ టుడేలో సందడి చేయనుంది. 90వ దశకంలో బాలీవుడ్ సినిమాను ఏలిన హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. 1991లో పత్తర్ కే పుల్’ సినిమా తో కెరీర్ ప్రారంభించింది రవీనా. ఆ తర్వాత ఏక్ హి రాస్తా, పెహ్లా నషా, దిల్‌వాలే, మొహ్రా, జిద్ది, దీవానా మస్తానా, దుల్హే రాజా, ఆంటీ నంబర్ వన్, షూల్, ఆంఖియోన్ సే గోలీ మారే, శాండ్‌విచ్ తదితర హిట్ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.

మన తెలుగు వారికి కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమే. బాలకృష్ణతో కలిసి బంగారు బుల్లోడు, నాగార్జునతో కలిసి ఆకాశ వీధిలో సినిమాల్లో నటించింది. తన అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు కూడా అందుకుందీ అందాల తార. ఇండియన్ సెల్యులాయిడ్‌పై ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు టీవీ 9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్‌ లో పాల్గొననుంది. ఆదివారం (ఫిబ్రవరి 25)న జరిగే స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఆమె తన సినిమా కెరీర్‌, వ్యక్తిగత విషయాలు, తన సక్సెస్ సీక్రెట్స్ ను అందరితో షేర్ చేసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగే ‘వాట్ ఇండియా టుడే’ గ్లోబల్ సమ్మిట్‌లో మొదటి రోజు ఫిబ్రవరి 25న స్పెషల్ ఎపిసోడ్ జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.