Most Recent

Tillu Square: క్రేజీ బజ్.. టిల్లు స్క్వేర్ లో అనుపమతో పాటు ఆ బ్యూటీ కూడా..

Tillu Square: క్రేజీ బజ్.. టిల్లు స్క్వేర్ లో అనుపమతో పాటు ఆ బ్యూటీ కూడా..

ఒకే ఒక్క సినిమా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డను స్టార్ బాయ్ గా మార్చేసింది. డీజే టిల్లు  సినిమా తర్వాత ఈ కుర్ర హీరో రేంజే మారిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకు  ముందు నాలుగు ఐదు సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్ ఒకే ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ క్రేజ్  ను డబుల్ చేయాలనీ చూస్తున్నాడు సిద్దూ. ఈ క్రమంలోనే ఇప్పుడు డీజే టిల్లు  సినిమాకు సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. టిల్లు స్క్వేర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరోసారి సిద్దూ యువతను ఆకట్టుకే కథతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అనుపమ గ్లామర్ గేట్లు ఎత్తేసింది అర్ధమవుతుంది. ట్రైలర్ లోనే ఓ డీప్ లీప్ కిస్ సీన్ తో అభిమానులు షాక్ అయ్యేలా చేసింది. అంతే కాదు మునుపెన్నడూ లేనంతగా గ్లామర్ షోతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది అనుపమ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

టిల్లు స్క్వేర్ లో రాధికా అంటే నేహా శెట్టి కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. డీజే టిల్లు  సినిమాలో రాధికాగా తన నటనతో అందంతో కట్టిపడేసిన నేహా శెట్టి ఇప్పుడు టిల్లు స్క్వేర్ లోనూ కనిపించనుందట. ఈ అమ్మడు చిన్న క్యామియో ఇస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. చివరకు మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది

సిద్దూ జొన్నలగడ్డ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)

సిద్దూ జొన్నలగడ్డ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.

 

View this post on Instagram

 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.