Most Recent

Nani : స్పీడ్ పెంచేసిన నేచురల్ స్టార్.. సరిపోదా శనివారం సినిమాతో పాటు ఆ డైరెక్టర్ తోనూ..

Nani : స్పీడ్ పెంచేసిన నేచురల్ స్టార్.. సరిపోదా శనివారం సినిమాతో పాటు ఆ డైరెక్టర్ తోనూ..

నేచురల్ స్టార్ నాని సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నాని సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ.. ఎదో ఒకటి చేసి తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు ఈ యంగ్ హారో.. ఇక ఇప్పుడు వరుస విజయాలతో ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. నాని , కీర్తిసురేష్ జంటగా నటించిన దసరా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే హయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే జోరు మీద మరి కొన్ని సినిమాలను లైనప్ చేశారు నాని. నిన్న నాని పుట్టిన రోజు సందర్భంగా.. రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు నేచురల్ స్టార్.

ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికి అనే సినిమాను చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరో సారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఈసారి పక్క ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిన్న నాని పుట్టిన రోజు సందర్భంగా సరిపోదా శనివారం సినిమా టీజర్  ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు నాని. సుజిత్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నారు. ప్రభాస్ సాహో సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నానితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ;యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. మొత్తంగా నాని మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by DVV Entertainment (@dvvmovies)

నాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..  

 

View this post on Instagram

 

A post shared by DVV Entertainment (@dvvmovies)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.