Most Recent

Mounika – Shanmukh Case: ‘నన్ను లైంగికంగా వాడుకుని బెదిరించాడు’.. సంపత్‌ పై మౌనిక.

Mounika – Shanmukh Case: ‘నన్ను లైంగికంగా వాడుకుని బెదిరించాడు’.. సంపత్‌ పై మౌనిక.

బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఓ అమ్మాయి కంప్లైంట్‌ చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో కథ ఊహించని మలుపుతిరిగింది. చీటింగ్‌ కేసులో విచారణకు వెళ్తే.. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిపోయారు షణ్ముఖ్ బ్రదర్స్‌. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు మౌనిక. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మించి.. మోసం చేశాడని కంప్లైంట్‌ చేసింది. యువతి ఫిర్యాదుతో విచారణ కోసం నానక్‌రాంగూడలోని షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు.. గంజాయితో దొరికిపోయారు ఇద్దరు.

షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌పై కంప్లైంట్‌ చేసిన మౌనిక.. ఇద్దరిపైనా సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో తనపై అనేకసార్లు సంపత్‌ లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఒకసారి అబార్షన్‌ కూడా చేయించాడని… ఎవరికైనా చెబితే పర్సనల్ ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించాడని తెలిపింది. షణ్ముఖ్‌ తల్లిదండ్రులకు చెబితే… వాళ్లు కూడా పర్సనల్‌ ఫొటోలు బయటపెడతామని బెదిరించారని అంటోంది మౌనిక. ఇక పోలీసుల విచారణలో సంపత్‌ గంజాయి వాడుతున్నట్టు తేలింది. అయితే, షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్‌ పిల్స్‌ దొరికాయి అంటోంది మౌనిక. షణ్ముఖ్‌ నుంచి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.