Most Recent

Sreeleela: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల అవుట్..? అసలు మ్యాటర్ అదేనా..

Sreeleela: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల అవుట్..? అసలు మ్యాటర్ అదేనా..

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది క్రేజీ బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టేసింది. అందం , అభినయంతో పాటు తన ఎనర్జీతో ప్రేక్షకులను కవ్వించింది. ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో శ్రీలీల పేరు మరు మ్రోగింది. ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్ లు వచ్చాయి. దాంతో వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల. యంగ్ హీరోలందరికీ సరసన ఛాన్స్ అందుకుంది ఈ క్రేజీ బ్యూటీ. ధమాకా సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఆ వెంటనే శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోయింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్,గుంటూరు కారం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే వీటిలో గుంటూరు కారం సినిమాతప్ప మిగిలినవన్నీ అశ్నించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల ఓ క్రేజీ ప్రోజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. శ్రీలీల విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే విజయ్ ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.