Most Recent

Shah Rukh Khan: ప్రేమతో హగ్‌ ఇచ్చిన షారుఖ్‌ ఖాన్‌.. ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని .. వీడియో చూశారా?

Shah Rukh Khan: ప్రేమతో హగ్‌ ఇచ్చిన షారుఖ్‌ ఖాన్‌.. ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని .. వీడియో చూశారా?

 

షారుఖ్ ఖాన్ నటించిన మూడు సినిమాలు 2023లో విడుదల అయ్యాయి. ‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’ చిత్రాలతో షారూఖ్‌ భారీ విజయాలను అందుకున్నారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ తన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం యశ్ రాజ్ స్టూడియోలో జరిగింది . షారూఖ్ ఖాన్ ఒక అభిమానిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కౌగిలింత అందుకున్న అభిమాని కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. షారుక్‌ను కలవాలనేది చాలా మంది అభిమానుల కల. ఈ కల అన్ని సందర్భాల్లోనూ నెరవేరదు. హీరోలు బిజీగా ఉంటారు. భద్రతా కారణాలతో చాలామంది బయటకు రారు. కానీ సోమవారం (జనవరి 29) షారుక్ ఖాన్ అన్నీ మర్చిపోయి జాలీ మూడ్ లో కనిపించాడు. తన అభిమానులను ఉద్దేశించి ఇష్టపూర్వకంగా మాట్లాడాడు. షారూఖ్‌తో మాట్లాడేందుకు ఓ అభిమాని వేదికపైకి వచ్చాడు. ఈసారి షారుక్ హగ్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానికి ఏం చేయాలో తోచలేదు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు షారూఖ్ ఖాన్ అభిమానిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. షారుక్‌తో ఫొటో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు సదరు అభిమాని.

‘షారుఖ్‌ ఖాన్‌ను తొలిసారి కలిశాను. అతను చాలా శ్రద్ధ చూపించాడు’ అని ఆ వ్యక్తి ట్విట్టర్‌లో రాశాడు. ఈ పోస్ట్‌కి రకరకాల కామెంట్స్ వచ్చాయి. మిగిలిన అభిమానులు ఆ వ్యక్తిని అదృష్టవంతుడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఆయన అభిమానుల మధ్య వైరల్‌గా మారింది. షారుఖ్ ఖాన్ ప్రవర్తించిన తీరుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 2023లో విడుదలైంది. ‘పఠాన్’, ‘డంకీ’ సినిమాలు 2023లో విడుదలయ్యాయి. త్వరలో ఆయన కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెద్ద దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను అనౌన్స్ చేస్తాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అభిమానికి హగ్ ఇస్తోన్న షారుఖ్ ఖాన్..

 

View this post on Instagram

 

A post shared by SRK VIBE (@_srkvibe2.0)

షారుక్ పై ప్రశంసలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.