Most Recent

Rashmika Mandanna: ఆ విషయంలో బన్నీ ఫ్యాన్స్‏కు రష్మిక ప్రామీస్.. ‘పుష్ప 2’ గురించి శ్రీవల్లి ఏం చెప్పిందంటే..

Rashmika Mandanna: ఆ విషయంలో బన్నీ ఫ్యాన్స్‏కు రష్మిక ప్రామీస్.. ‘పుష్ప 2’ గురించి శ్రీవల్లి ఏం చెప్పిందంటే..

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే యానిమల్ సినిమాతో సెన్సెషన్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి హిందీలో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న పుష్ప 2 గురించి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప 2 సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే చాలా పెద్దదిగా ఉంటుందని.. ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే బన్నీ అభిమానులకు ఈ మూవీ విషయంలో ప్రామిస్ కూడా చేసింది. అలాగే ఈ సినిమాలో ఇటీవలే ఓ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలిపింది రష్మిక.

“పుష్ప 2 చాలా పెద్దదిగా ఉంటుందని మీకు ప్రామీస్ చేస్తున్నాను. మొదటి సినిమాతో మీకు ఎంటర్టైన్మెంట్ అందించాము. దీంతో మాపై మరింత బాధ్యత ఏర్పడింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మేము ఈ అంచనాలను అందించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడే పుష్ప 2 కోసం ఓ సాంగ్ షూట్ చేసాను. అది ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇది ఒక ముగింపు లేని కథ.. దీనిని గేమ్ గా గానీ.. పలు విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఆనందించవచ్చు.. మీకు మంచి సినిమా అందించాలనే తపనతో డైరెక్టర్ సుకుమార్ కష్టపడుతున్నారు ” అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ఈ సినిమా విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి లేదని.. పుష్ప 2లో తన పాత్ర చాలా మెరుగ్గా ఉంటుందని.. గత రెండేళ్లుగా మరింత మెరుగైన నటనను ప్రేక్షకులకు అందిస్తున్నాననే నమ్మకంపై తనకు ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.