Most Recent

Pushpa 2 The Rule: అల్లు అర్జున్‌ ‘పుష్ఫ 2’ విడుదల తేదీ మారనుందా? సుకుమార్‌ టీమ్‌ సమాధానమిదే..

Pushpa 2 The Rule: అల్లు అర్జున్‌ ‘పుష్ఫ 2’ విడుదల తేదీ మారనుందా? సుకుమార్‌ టీమ్‌ సమాధానమిదే..

ఈ ఏడాది రిలీజ్‌ కానున్న ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్‌ నటిస్తోన్న ఈ పాన్‌ ఇండియాపై సినిమాలు భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప1 బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడం, పుష్ఫ2 పోస్టర్స్‌, టీజర్‌ కూడా ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. అందుకు తగ్గట్టుగానే చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఆగస్ట్ 15 న ‘ పుష్ప 2 ‘ విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింద . అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ రూమర్ వినిపిస్తోంది. కొన్ని కారణాల వల్ల ‘పుష్ప 2’ విడుదల తేదీని ముందుకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందమే క్లారిటీ ఇచ్చింది. ‘పుష్ప 2’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌కి చాలా అడ్డంకులు ఉన్న మాట వాస్తవమే. దీంతో విడుదల తేదీ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ‘పుష్ప 2’కి బదులుగా ఆగస్ట్ 15న విడుదలవుతుందని కొందరు గాసిప్‌లు ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

‘పుష్ప’ సినిమా పేరుతో ‘X’ (ట్విట్టర్) ఖాతాలో కొత్త పోస్ట్ షేర్ మేకర్స్‌. ఇందులో అల్లు అర్జున్ వీడియో ఉంది. ‘ఇక్కడ అంతా పుష్ప పాలనపైనే జరుగుతుంది. ’15 ఆగస్ట్ 2024. #Pushpa2TheRule’ అనే క్యాప్షన్ ఇచ్చారు. తద్వారా ‘పుష్ప 2’ సినిమా విడుదల తేదీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది చిత్ర బృందం. ‘పుష్ప 2’ టీమ్‌కి సినిమా పనులు పూర్తి చేయడానికి 6 నెలలకు పైగా సమయం ఉంది. అప్పటికి పనులన్నీ పూర్తవుతాయి. జూలై నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేకర్స్‌ ధీమాతో ఉన్నారట. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, సునీల్‌, అనసూయ, డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పుష్ఫ2 సినిమాను నిర్మిస్తోంది.

 అల్లు అర్జున్ ట్వీట్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.