Most Recent

Prabhas : ‘డార్లింగ్ ఓకే..కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు ?’.. ప్రభాస్‏ను నేరుగా అడిగేసిన శ్రుతిహాసన్..

Prabhas : ‘డార్లింగ్ ఓకే..కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు ?’.. ప్రభాస్‏ను నేరుగా అడిగేసిన శ్రుతిహాసన్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నిరాశ చెందారు. కానీ చాలా కాలం తర్వాత సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈసినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీకి భారీ స్తాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా..ఇప్పుడు ఓటీటీ పార్టనర్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చిత్రయూనిట్ అంతగా ప్రమోషన్స్ జరపలేదు. కేవలం రాజమౌళికి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఇప్పుడు సలార్ చిత్రబృందానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ డార్లింగ్ ఓకే.. కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు ?.. అంటూ పృథ్వీరాజ్ సందేహం వ్యక్తం చేయగా… ఎందుకు ?.. అంటూ నేరుగా ప్రభాస్ ను అడిగేసింది శ్రుతి.

“ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అందరూ డార్లింగ్ తో సినిమా చేస్తున్నావా అని అడిగేవారు.. అది విని విని హా అవును అంటూ చెప్పేదాన్ని. కానీ ప్రభాస్ ను కలిసిన వారం రోజులకే నాకు అర్థమైంది.. తనను ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో” అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. దీనిపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. నాకు ప్రభాస్ ను రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో తెలియదు… కానీ తనను డార్లింగ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు. దీంతో వెంటనే.. అవును ప్రభాస్.. నిన్ను రెబల్ స్టార్ అని ఎందుకు అంటారు ?.. అంటు క్వశ్చన్ చేసింది శ్రుతి.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

దీంతో ప్రభాస్ రియాక్ట్ అవుతూ.. మా పెద్దనాన్న రెబల్ స్టార్ అంటూ నవ్వుతూనే బదులిచ్చాడు. ఇక ఆ తర్వాత శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రొమాన్స్ కంటే బ్రొమాన్స్ ఎక్కువ అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో వీరు ముగ్గురు ఎంతో సరదాగా .. ఫన్నీగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.