
సలార్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. బాహు బలి 2 తర్వాత వరుసగా అపజయాలు ఎదుర్కొన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు సలార్ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. డిసెంబర్ 22న విడుదులైన ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో సలార్ చిత్ర బృందం కర్ణాటకలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించింది. హీరో ప్రభాస్, హోంబలే ప్రొడక్షన్ కంపెనీ యజమాని, ‘సలార్’ చిత్ర నిర్మాత విజయ్ కిర్గందూర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు శుక్రవారం మంగళూరు క్షేత్రంలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రభాస్‌కు దేవస్థానం అమ్మవారి విగ్రహాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు. ఇదిలా ఉంటే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. సలార్ మూవీ ప్రమోషన్లలోనూ పెద్దగా కనిపించలేదు. జస్ట్ రాజమౌళికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ప్రభాస్ ఉన్నట్లుండి గుడిలో ప్రత్యక్షమవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా వైట్ క్యాప్, మాస్క్‌తో దర్శనమించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
సలార్ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, శ్రియా రెడ్డి, జగపతి బాబు, బాబీ సింహా, ఈశ్వరి రావు, టినూ ఆనంద్, రామచంద్ర రాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రవి బ్రసూర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం 2025లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2989’ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఆ సినిమాతో పాటు దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ఓ హారర్ థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పాడు. ఈ సినిమా ముగియగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలో భాగం కానున్నాడు.
దుర్గా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు..
. #Prabhas @ Kateel Temple. He walked a lot may divine listens to him & bestow him whatever his desires are
pic.twitter.com/uZ6w5By1Xg
— Ace in Frame-Prabhas (@pubzudarlingye) January 12, 2024
చాలా రోజుల తర్వాత దైవ సన్నిధిలో ప్రభాస్..
May the force be with u always !
.#Prabhaspic.twitter.com/luGV7WOxNv
— Ace in Frame-Prabhas (@pubzudarlingye) January 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
