Most Recent

Prabhas: ‘స్పిరిట్‌’ మూవీ గురించి సందీప్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఏమన్నారంటే..

Prabhas: ‘స్పిరిట్‌’ మూవీ గురించి సందీప్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. ఏమన్నారంటే..

సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌.. ఇలా వరుసగా మూడు భారీ పరాజయాల తర్వాత ప్రభాస్‌, సలార్‌ రూపంలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తన స్టామినా ఏంటో మలరోసారి నిరూపించున్నారు. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దేశ వ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుందీ సినిమా. కలెక్షన్లు క్రమంగా పెరుగుతూ రూ. వెయ్యి కోట్ల మార్కెట్ దిశగా దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే సలార్‌ చిత్రం భారీ విజయంతో ప్రభాస్‌ తర్వాత చిత్రాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సలార్‌ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కూడా ప్రభాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. ఇక సలార్‌ తర్వాత ప్రభాస్‌ మంచి లైనప్‌తో వస్తున్నారు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్‌, సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్‌, పఠాన్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ సినిమా చేయనున్నారు.

ఇక ప్రాజెక్ట్ కే తర్వాత ప్రభాస్‌ నటించనున్న స్పిరిట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణంగా ఈ సినిమా దర్శకుడు సందీప్‌ వంగ. అర్జున్‌ రెడ్డి సంచనాలకు మారుపేరుగా నిలిచిన సందీప్‌.. తాజాగా యానిమల్‌ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో సందీప్‌ బాలీవుడ్‌లో మరోసారి తన సత్తా చాటాడు. భారీ కలెక్షన్లతో ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో, సందీప్‌ తర్వాతి చిత్రంపై అందరి దృష్టి పడింది.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు సందీప్‌ వంగ ‘స్పిరిట్‌’ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పిరిటీ మూవీ స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్వ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. స్పిరిట్‌ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.