Most Recent

Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీ ట్రెండ్ సెట్టర్‌ అవుతుంది.. నటుడు వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీ ట్రెండ్ సెట్టర్‌ అవుతుంది.. నటుడు వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా సినిమాలను లైనప్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో రావాల్సిన హరిహరవీరమల్లు సినిమా చాలా కాలంగా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. సాహో సినిమా తర్వాత సుజిత్ చేస్తున్న సినిమా ఇది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుజిత్. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుజిత్.

ఇప్పటికే ఓజీ సినిమా పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు నటుడు వెంకట్. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుజిత్. ఈ సినిమా గురించి వెంకట్ ఆటలాడుతూ.. పవన్ కళ్యాణ్ ఓజీ’లో కీలకపాత్ర పోషిస్తున్నా. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో నేను అన్నయ్య సినిమా చేశాను అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది.

ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అన్నారు వెంకట్. పవన్ కళ్యాణ్ గారితో పరిచయం తర్వాత దాదాపు 23 ఏళ్ల తర్వాత కలిసి వర్క్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓజీ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని అన్నారు వెంకట్. ఓజీ సినిమాలో కీలక పాత్రలో శ్రీయా రెడ్డి నటించనుంది. అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.