Most Recent

Padma Awards: వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Padma Awards: వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు ప్రకటించిన కేంద్రం

ప్రతి ఏడాది మాదిరిగానే మోదీ ప్రభుత్వం ఈసారి కూడా అనుహ్యంగా పురస్కారాలను ప్రకటించింది. తమ పని ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిలకు పద్మవిభూషణ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నటుడు మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఐదుగురు ప్రముఖులకు పద్మవిభూషణ్‌తో సత్కరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు, ప్రముఖ హిందీ సినీ నటి వైజయంతిమాల, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రమణ్యం, మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) ఉన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనతోపాటు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్‌ అవార్డు దక్కింది. ఇప్పటికే చిరంజీవి సినీ, రాజకీయ రంగానికి చేసిన సేవలకుగానూ పద్మ భూషణ్‌ అవార్డుతో గౌరవించింది. కరోనా, లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం చిరుని పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది.

కరోనా కష్ట కాలంలో వేలమంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగానో సేవ చేశారు . సీసీసీ పేరుతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సదుపాయాలను కల్పించారు. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో చిరంజీవి పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు బీజీపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది. ఇక ఈ ఏడాది మొత్తం 132 మంది ప్రముఖుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

పూర్తి జాబితా కోసం ఇక్కడ చూడండి... PadmaAwardees2024

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.