![Hanuman Movie: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. మెగా ఉత్సవ్ కోసం ఆ స్టార్ హీరో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/01/hanuman.jpg)
ఇప్పుడు టాలీవుడ్ అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘హనుమాన్’ ఒకటి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ.. ఈ చిత్రంపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఫ్యామిలీ అడియన్స్, యూత్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తు్న్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
‘హనుమాన్’ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్‌ను జనవరి 7న ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేస్తూ.. ‘హనుమాన్’ సినిమా నుంచి తేజ సజ్జా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మెగా ఉత్సవ్ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారట. తాజాగా మూవీ రిలీజ్ చేసిన పోస్టర్ లో చిరు వస్తున్నారని నేరుగా చెప్పకపోయినా.. “మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్” అని తెలియజేసి హింట్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా సినీ వర్గాల్లో అయితే చిరంజీవి అతిథిగా రాబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
His highness should be celebrated in a grand and splendid way
Celebrating #HANUMAN, Mega Pre-Release Utsav on JANUARY 7th, Sunday
N Convention, HYD
6PM Onwards
A @PrasanthVarma Film
ing @tejasajja123
In WW Cinemas from JAN 12, 2024!#HanuManOnJAN12th@Niran_Reddy… pic.twitter.com/QBYkaXOq8u
— Primeshow Entertainment (@Primeshowtweets) January 3, 2024
ఇక కొద్దిరోజుల నుంచే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా చిరు కూడా భాగం కాబోతున్నారట. ఈ మూవీలో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.