సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈసారి సంక్రాంతి పండక్కి గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. గురూజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన రీజనల్ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్, మీనాక్షి చౌదరి, శ్రీలీల కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ ఎక్కువే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రంలోని ప్రతీ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నెట్టింట గుంటూరు కారం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో కుర్చి మడతపెట్టి.. ఓ మై బేబీ.. ధమ్ మసాలా, మావ ఎంతైనా పర్లేదు బిల్లు… పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు మహేష్ గారాలపట్టి సితార ఘట్టమనేని అందంగా డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
మహేష్ బాబు డాటర్ సితార ఘట్టమనేని గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు.. వెకేషన్ ఫోటోస్ ఇలా ప్రతి విషయాన్ని పాలోవర్లతో పంచుకుంటుంది. ఇక కొద్ది రోజులుగా డాన్స్ రీల్స్ చేస్తూ వీడియోస్ పంచుకుంటుంది. తాజాగా గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ పాటకు అందంగా స్టెప్పులేసింది… ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్… అంటూ సాగే పాటకు సితార వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సూపర్ డాన్స్.. అదరగొట్టేసావ్ సీతూపాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
సితారకు ఇన్ స్టాలో మొత్తం 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా మారింది సితార. అంతకు ముందు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ చిన్నారులకు సంబంధించిన విషయాలను పంచుకుంది. ఇక తనకు నటనపై ఆసక్తి ఉందని గతంలోనే వెల్లడించింది సితార. దీంతో భవిష్యత్తులో మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.