రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రూ. 600 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్‌లో మరో 100 కోట్లు దక్కించుకోవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతోన్న ‘సలార్’ ఒక చోట మాత్రం వెనుకబడింది. ఈ చిత్రం కంటే.. ఓ ప్రాంతీయ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆ సినిమా ఏంటి.? ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..!
‘సలార్’ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీశాడు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఈ సినిమా తాను తీసిన ఫస్ట్ మూవీ ‘ఉగ్రమ్’కు ఫ్రీమేక్ అన్నట్టుగా.. సరిగ్గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు చెప్పాడు. మిగిలిన భాషా ప్రేక్షకులకు ‘ఉగ్రమ్’ సినిమా పెద్దగా తెలియదు. అయితే కన్నడ ఫ్యాన్స్ మాత్రం చాలాసార్లు చూసేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ‘సలార్’ వసూళ్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఇప్పటివరకు అక్కడ ‘సలార్’ రూ. 35.7 కోట్ల వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో డిసెంబర్ 28న విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో దర్శన్ హీరోగా వచ్చిన ‘కాటేరా’కు కేవలం రెండు రోజుల్లో రూ. 37 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు దేశమంతటా ‘సలార్’ ప్రభంజనం సృష్టిస్తుంటే.. కన్నడంలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఇదే ‘కాటేరా’కు ప్లస్ అయింది. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే.. ప్రభాస్ ‘సలార్’ ముందు.. దర్శన్ మూవీ అస్సలు నిలబడలేకపోయేది.
Our Deva wishing everyone a very #HappyNewYear
‘While I decide the fate of Khansaar, you all sit back and have a fantastic New Year darlings!
Thank you for owning #SalaarCeaseFire and making it a big success.’ – #Prabhas via Instagram. pic.twitter.com/tF3yT9JsLy— Salaar (@SalaarTheSaga) January 1, 2024