
మెగా హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈరోజు సాయంత్రమే టస్కానీలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. అక్టోబర్ 30న మొదలైన ఈ పెళ్లి వేడుకలలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ వీరి పెళ్లి వేడుకలలో కనిపించారు. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను పెళ్లిలో వరుణ్, లావణ్య ధరించారు.

Varun Tej Lavanya Tripathi
ఈ నెల 5న హైదరాబాద్లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు.
#VarunLav pic.twitter.com/US0HcoaeFS
— Naidu0555 (@princen23219312) November 1, 2023
2017లో మిస్టర్ సినిమాలో కలిసి నటించారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అంతరిక్షం సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకులేకపోయింది. దాదాపు ఆరు సంవత్సరాలు ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
Mega Prince @IAmVarunTej & @Itslavanya are all set to tie knot today …
#VarunTej #LavanyaTripathi #VarunLav pic.twitter.com/mMWCFAmtOW
— Arun Kumar JSPK (@arun1995s) November 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.