Most Recent

Tiger Nageswara Rao OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tiger Nageswara Rao OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర వంటి హిట్‌ సినిమాల తర్వాత హీరో రవితేజ నటించిన చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. 1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా పాపులర్‌ అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా డైరెక్టర్‌ వంశీ ఈ మూవీని తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్‌ హీరోయిన్‌ రేణూ దేశాయ్‌ చాలా రోజుల తర్వాత హేమలతా లవణం పాత్రలో కనిపించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 20న థియేటర్లలో విడుదలైన టైగర్‌ నాగేశ్వరరావుకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కావడం, అంచనాలు భారీగా ఉండడంతో కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. అయితే రవితేజ మార్క్‌ వినోదం, మాస్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ అభిమానులను బాగా అలరించాయి. థియేటర్లలో అలరించిన టైగర్‌ నాగేశ్వర రావు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు వచ్చేశాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో రవితేజ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (నవంబర్‌ 17) అర్ధరాత్రి నుంచే టైగర్‌ నాగేశ్వరరావు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో టైగర్‌ నాగేశ్వరరావు స్ట్రీమింగ్ అవుతోంది. కాగా మొదట నవంబర్‌ 27న రవితేజ సినిమా ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వారం ముందుగానే ఈ పాన్‌ ఇండియా మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమాను నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ మరో కీలక పాత్రలో మెరిశారు. జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, హరీష్‌ పేరడి, నాజర్‌, ఆడుకాలం నరేన్‌, ప్రదీప్‌ రావత్‌ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు అందించారు. మరి థియేటర్లలో టైగర్‌ నాగేశ్వరరావును మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఇంట్లోనే రవితేజ మార్క మూవీని చూసి ఎంజాయ్‌ చేయండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

గజదొంగ పాత్రలో మాస్ మహరాజా

టైగర్ నాగేశ్వ రావు ట్రైలర్..

 

View this post on Instagram

 

A post shared by Nupur Sanon (@nupursanon)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.