Most Recent

The Village: బాబోయ్.. వెన్నులో పుట్టించే వెబ్ సిరీస్.. టీజర్‏లో భయపెట్టిస్తోన్న హీరో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

The Village: బాబోయ్.. వెన్నులో పుట్టించే వెబ్ సిరీస్.. టీజర్‏లో భయపెట్టిస్తోన్న హీరో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

కోలీవుడ్ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాజా రాణి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ఆర్య. ఆ తర్వాత వరుడు సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ ‘ది విలేజ్’. ఈ సిరీస్‏తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఆర్య. ఇందులో దివ్య పిళ్లై, అజియా, ఆడుకలం నరేన్, జార్జ్ మాయన్, పి.ఎన్. సన్నీ, ముత్తుకుమార్ కె, కలైరాణి ఎస్.ఎస్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. దీనికి మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో శక్తి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో హారర్ ఒరిజినల్ సిరీస్‏గా రూపొందించారు. తమిళంతోపాటు.. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈక్రమంలోనే గురువారం ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా ఈ హారర్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సిరీస్ తెరకెక్కించారు. ఒక రాత్రి తప్పిపోయిన తన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు ఒక వ్యక్తి ఎంతో కష్టమైన పని చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో తను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? తన కుటుంబం ఏమైంది? చివరకు తన కుటుంబాన్ని తిరిగి పొందాడా ?.. అనేది వెబ్ సిరీస్.

“ఒక మంచి భయానక ధారావాహిక లేదా చలనచిత్రం రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లడానికి మిమ్మల్ని భయపెట్టగలదని నేను నమ్ముతున్నాను. ఇక్కడ కొమ్మలు కొట్టే శబ్దం మీ హృదయాలను బయటపెడుతుంది. అక్కడ నీడలు మీ చుట్టూ ఉన్నట్లే కనిపిస్తాయి. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి మరింత భయపెట్టే కంటెంట్‌ని తీసుకురావాలనుకుంటున్నాను. ది విలేజ్‌తో ప్రతి ఒక్కరికి కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించానని అనుకుంటున్నాను ”అని డైరెక్టర్ మిలింద్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.