తెలంగాణలో ఓట్ల పండగ ప్రారంభమైంది. గురువారం (నవంబర్ 30) ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల వద్ద హడావిడి నెలకొంది. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు చిరంజీవి. మెగాస్టార్ వెంట ఆయన సతీమణి సురేఖ, కూతురు శ్రీజ ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూలులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు నటుడు ఎన్టీఆర్. అందరితో పాటు క్యూలో నిలబడి మరీ ఓటు వేసిన ఎన్టీఆర్..ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అలాగే జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ హీరో అల్లు అర్జున్. ఉదయం 7గంటలకే క్యూలో నిలబడి పోలింగ్ కేంద్రానికి రాగా… ఈవీఎం మొరాయించింది. కాసేపు వెయిట్ చేసి…ఆ తర్వాత ఓటు వేసి వెళ్లారు అల్లు అర్జున్. జూబ్లీహిల్స్ క్లబ్‌లో సుమంత్ ఓటు వేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లోతన ఓటు హక్కును వినియోగించారు. ఆయన వెంట కుమారుడు, ప్రముఖ సింగర్ కాల భైరవ కూడా ఉండి ఓటును వేశారు.
జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేసిన చిరంజీవి కుటుంబ సభ్యులు..
Megastar #Chiranjeevi with family arrived to cast vote#TelanganaElections2023 pic.twitter.com/ud8y72hSPN
— Support for Modi (@HDCricket21076) November 30, 2023
అల్లు అర్జున్
VIDEO | Actor @alluarjun arrives at a polling booth in Jubilee Hills in Hyderabad to cast his vote.#TelanganaElections2023 #AssemblyElectionswithPTI pic.twitter.com/XMh3YxfyPz
— Press Trust of India (@PTI_News) November 30, 2023
జూబ్లీ హిల్స్ ఓటుల్ రెడ్డి స్కూల్ వద్ద ఎన్టీఆర్ ఫ్యామిలీ..
NTR @tarak9999 Anna At 𝐎𝐁𝐔𝐋 𝐑𝐄𝐃𝐃𝐘 𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐒𝐂𝐇𝐎𝐎𝐋, Jublie Hills, Hyderabad.#ManOfMasses𝐍𝐓𝐑@tarak9999#TelanganaElections2023 pic.twitter.com/pP9EmFe0L5
— Nadiri Ravi 9999 (@NadiriRRRavi) November 30, 2023
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.