Most Recent

Raviteja: మరోసారి పవర్‏ఫుల్ మాస్ కథతో మాస్ మాహారాజా రెడీ.. గోపిచంద్ భారీ ప్లాన్..

Raviteja: మరోసారి పవర్‏ఫుల్ మాస్ కథతో మాస్ మాహారాజా రెడీ.. గోపిచంద్ భారీ ప్లాన్..

హిట్టు, ప్లాపు అనే సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు రవితేజ. ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం ఈగల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత అంచనాలు పెంచేశాయి. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈసారి ఈగల్ చిత్రంతో సరికొత్త కంటెంట్‏తో రాబోతున్నారు మాస్ మాహారాజా. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై రవితేజ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈగల్ సినిమాతోపాటు.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు.

రవితేజ, గోపిచంద్ మలినేని హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శ్రీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ అంటే మరింత హైప్ నెలకొంది. ఈ సినిమాను పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతుందట. పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని.. రవితేజ కూడా రాయలసీమ ఫ్లేవర్ కు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ మాండలికం పర్ఫెక్ట్ గా ఉండేలా ప్రత్యేకంగా రచయితలతో శిక్షణ తీసుకోనున్నాడని టాక్. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

అంతేకాకుండా ఈ సినిమాలోని డైలాగ్స్ సైతం చాలా పవర్ఫుల్ గా ఉంటాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ప్రకటించాల్సి ఉంది. వచ్చే ఏడాది చివరలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందట.

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.