Most Recent

Bigg Boss 7 Telugu: పాపం భోళె..! గేమ్ పేరుతో పిచ్చ కొట్టుడు కొట్టారుగా…

Bigg Boss 7 Telugu: పాపం భోళె..! గేమ్ పేరుతో పిచ్చ కొట్టుడు కొట్టారుగా…

ఇవ్వాళ్టి అంటే 62nd ఎపిసోడ్ కూడా… కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్కులతో సాగింది. షో మొదలవ్వడమే ‘హాల్ ఆఫ్ బాల్’.. రిమైనింగ్ టాస్క్‌తో మొదలైంది. ఇక గేమ్‌ను ఎంతో కష్టపడి ఆడుతున్న వీరసింహాలు.. గర్జించే పులలకు బిగ్ బాస్ ఇవ్వాళ్టి ఎపిసోడ్ బిగినింగ్లోనే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. బ్లాక్ బాల్ దక్కించుకున్న వీర సింహాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుందంటూ చెబుతాడు. గర్జించే పులలతో .. వీర సింహాలు… బాల్స్ స్వాప్ చేసుకోవాలని.. అదే బ్లాక్ బాల్‌కున్న అడ్వాంటేజ్ అంటూ చెబుతాడు. దీంతో వీర సింహాల దగ్గర ఎక్కువగా బాల్స్ వచ్చి చేరతాయి. కెప్టెన్సీ కంటెడర్స్‌ రేసులో వీర సింహాలను ముందుకు వెళ్లేలా చేస్తాయి.

అయితే ఇంతకు ముందు ఎపిసోడ్‌లో.. ఆ బ్లాక్ బాల్.. మొదట భోళెకు దొరుకుతుంది. అయితే బ్లాక్ బాల్‌ తన దగ్గరుంటే తమ టీంకు డిస్ అడ్వాంటేజ్ వస్తుందన్న భయంతో.. దాన్ని వీరసింహాల టీం సభ్యుడు గౌతమ్‌కు ఇస్తాడు. అలా తనకు తెలియకుండానే.. భోళె… తన అపోనెంట్ టీంను గెలిపిస్తాడు.

ఇక ‘హాల్ ఆఫ్ బాల్’ గేమ్ గెలవడంతో… కెప్టెన్సీ కంటెడర్స్‌ గా ఎన్నికైన వీర సింహాలు.. ఓటింగ్ ద్వారానే తమలో ఒకరిని కెప్టెన్ చేస్తాడంటూ… అవతలి టీంలో ఉన్న సభ్యులను మచ్చిక చేసుకుంటూ ఉండగా… ఉన్నట్టుండి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్… మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడు. కెప్టెన్ ఎవరనేది ఫిజికల్ టాస్క్‌తో తేలుస్తామని చెబుతాడు. అందులోనూ… కెప్టెన్సీ కంటెడర్స్‌గా ఉన్న వారు కాకుండా… తమను సపోర్ట్ అవతలి టీం.. గర్జించే పులల టీంలోని సభ్యులు ఈ గేమ్‌ ఆడాలని చెబుతాడు. వారిలో ఒకరు గెలిస్తే.. వారి తరుపున ఆడిన వీర సింహం టీంలోని సభ్యుడు ఒకడు కెప్టెన్ అవుతాడని చెబుతాడు. అందుకోసం బీన్ టాస్క్‌ ఒకటి పెడతాడు.

గార్డెన్ ఏరియాలో.. కెప్టెన్ కంటెండర్స్‌ ఫోటోలతో బీన్ బ్యాగ్స్‌ ఉంటాయని.. కెప్టెన్ కంటెండర్స్‌ను సపోర్ట్ చేసిన వాళ్లు… వారి వారి సపోర్ట్ చేస్తున్న కంటెండర్స్ బ్యాగ్‌ను భుజానికి వేసుకొని.. యెల్లో సర్కిల్లో తిరుగుతూ…. అవతలి బ్యాగ్‌లో ఉన్న బీన్స్ కింద పడిపోయేలా చేయాలని చెబుతాడు. అలా బజర్ మోగే టైంకు.. ఎవరి బ్యాగ్‌లో తక్కువగా బీన్స్ ఉంటాయో.. వాళ్లు గేమ్ నుంచి బయటికి వెళతారని.. చెబుతాడు. ఫైనల్‌గా ఈ గేమ్‌లో ఒక్కరు మిగులుతారని వారే విన్నర్ అంటూ గేమ్ ను వివరిస్తాడు.

ఇక ఈ గేమ్‌లో.. అమర్ శోభ కోసం.. ప్రియాంక – తేజ కోసం, భోళె – రతిక కోసం గేమ్‌ ఆడేందుకు ముందుకు వస్తాడు. అశ్విని చాలా డిస్కషన్స్ తర్వాత గౌతమ్‌ కోసం గేమ్ ఆడుతానంటూ ముందుకు వస్తుంది. శివాజీ అర్జున్ కోసం బరిలో దిగుతాడు. ఇక అప్పటికే గర్జించే పులులు టీంలో ఉన్న ప్రశాంత్‌ను గేమ్‌ నుంచి అపోనెంట్ టీం బయటికి తీసింది కదా… దీంతో విన్నర్ టీంలో ఒకరికి.. లూజర్ టీంలో సపోర్ట్ లేకుండా పోతాడు. అలా ఎవరైతే సపోర్టర్ లేకుండా మిగులుతాడో .. వారు కూడా గేమ్ నుంచి బయటికి వచ్చినట్టే అంటూ… బిగ్ బాస్ చెబుతాడు. దీంతో యావర్ గేమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక గేమ్‌లో డెడ్‌ అయిన ప్రశాంత్ను సంచాలక్‌గా నియమిస్తాడు బిగ్ బాస్.

యోల్లో సర్కిల్లో బీన్ బాగ్స్‌ వేసుకుని.. మొదట చాలా కూల్‌గానే కనిపించిన అమర్.. టాస్క్‌ మొదలై ఓ పది నిమిషాలు కాగానే విరుచుకు పడతాడు. మొదట భోళె బ్యాగ్‌ పై అంటే.. రతిక బ్యాగ్ పై టార్కెట్ చేస్తాడు. భోళె బ్యాగులో ఉన్న బీన్స్‌ను కింద పడేస్తుంటాడు. అందుకోసం భోళె పై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాడు. భోళె కూడా అమర్‌ ను కాలర్ పట్టుకుని కొట్టినంత పని చేస్తాడు. ఒకరినొకరు డొక్కలో గుద్దుకుంటూ… చూస్తున్న ఆడియెన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇక మరో పక్క సంచాలక్ పల్లవి ప్రశాంత్ వీరిని కంట్రోల్ చేసేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు.

అయితే భోళెకు మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన అమర్, ప్రియాంక, శివాజీ వెంటనే అశ్విని బ్యాగ్ పై అంటే గౌతమ్‌ బ్యాగ్‌ పై ఎటాక్ చేస్తారు. అమర్‌ అయితే భోళె మీద అటాక్ చేసినట్టే… అశ్విని మీద కూడా అటాక్ చేస్తాడు. ఆమెను కూడా కొట్టినంత పని చేస్తాడు. అందుకు అశ్విని కూడా… అమర్‌పై గట్టిగానే మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుంది. అలా ఫస్ట్ రౌండ్‌లో మొత్తానికి అశ్విని ఎలిమినేట్ అయ్యేలా చేస్తారు. అంటే.. గౌతమ్‌ కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయాడన్న మాట.

ఇక ఆ తరువాత మళ్లీ భోళె దగ్గరికి వచ్చిన అమర్ ఈ సారి.. మరింత అగ్రెసివ్‌గా అటాక్ చేస్తాడు. రెచ్చి పోయి మరీ పిచ్చి పిచ్చిగా భోళె బీన్ బ్యాగ్ మీద పతడాతు. కుర్రాడి ధాటికి పాపం భోళె బిత్తర పోయి.. ఏం చేయలో పాలుపోని స్థితికి వెళిపోతాడు. అయినా కానీ గేమ్ ఆపని భోళె… ఆ పక్కనే ఉన్న ప్రియాంక మీద అటాక్ చేస్తాడు. తన బ్యాన్‌లో ఉన్న బీన్స్‌ ను కింద పడేసే క్రమంలో ప్రియాంకను కింద పడేస్తాడు. అయితే అలా కింద పడిన ప్రియాంక.. భోళెను తన కాళ్లతో తన్నుతూ… అగ్రెసివ్ అవుతుంది. ఈ క్రమంలోనే భోళె డొక్కలో అమర్‌ చేయి తగులుంది. నన్ను కడుపులో కొట్టావ్ అని భోళె లేదని నీ బ్యాగ్ ను కొట్టానని అమర్‌ .. ఇలా వాదించుకుంటూ ఉంటారు.

ఇలా చిన్నపాటి రెజ్లింగ్ ఆటలా సాగిన ఈ టాస్క్‌లో… మొత్తానికి భోళెను ఎలిమినేట అయ్యేలా.. అంటే రతిక కెప్టెన్సీ టాస్క్‌ నుంచి బయటికి పోయేలా చేస్తాడు అమర్. ఇక తరువాత.. అమర్ , ప్రియాంక ఇద్దరూ కలిసి.. శివాజీ అంటే అర్జున్ బ్యాగ్‌ను టార్గెట్ చేస్తారు. ఇక ఈక్రమంలోనే అమర్ కారణంగా.. మరో సారి తన చేయి గాయంతో.. విలవిలలాడుతూ.. గేమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు శివాజీ. అలా అర్జున్ కూడా కెప్టెన్సీ టాస్క్‌ నుంచి బయటికి వచ్చేస్తాడు.

ఇక మిగిలిన ప్రియాంక అంటే తేజు… అమర్ అంటే శోభ.. మధ్య మరో రౌండ్ కంటిన్యూ అవగా… అమర్ అంతే అగ్రెసివ్‌గా ప్రియాంకను కింద పడేసి మరీ.. తన బ్యాగ్ అంటే తేజ ఫోటో ఉన్న బ్యాగ్ ను ఖాళీ చేయించడంతో… అమర్ ఈ టాస్క్‌లో విన్నర్ అవుతాడు. తన సపోర్ట్ చేసిన శోభను గెలిపించుకుంటాడు. అలా ఈ వారం శోభ… 5 కెప్టెన్‌గా.. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ లేడీ కెప్టెన్‌గా.. గౌతమ్‌ నుంచి బ్యా డ్జ్‌ అందుకుంటుంది. కానీ ఇవ్వాళ్టి ఎపిసోడ్ చూసిన వారికి… భోళెను చూస్తూ బాధేస్తుంది. టాస్క్‌ పేరుతో.. భోళెను రిమైనింగ్ కంటెస్టెంట్ అందరూ పిచ్చి కొట్టుడు కొట్టినట్టు అనిపిస్తుంది. ఆయనపై బీబీ ఆడియెన్స్‌లో సింపతీ ఫీలింగ్ వచ్చేలా చేసేట్టు కనిపిస్తుంది. అదే కనుక జరిగే.. మరో మూడు వారాలు ఏ రందీ లేకుండా బీబీ హౌస్‌లో భోళె ఉండుడు ఖాయం.

 

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.