Most Recent

Bigg Boss 7 Telugu: పాపం రతికా.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

Bigg Boss 7 Telugu: పాపం రతికా.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

బిగ్ బాస్ హౌస్ లో నిన్న ర్యంకింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ఈ పదివారాల పర్ఫామెన్స్ ను బట్టి ఒకొక్కరు ఒకొక్క స్థానంలో నిలుచోవాలని పది నెంబర్ బోర్డులు పెట్టాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా చర్చించి వారికి ఒక నెంబర్ ఇవ్వాలి అని చెప్పాడు. దాంతో ఒకొక్కరు ముందు తాము ఉంటామనుకున్న స్థానాల్లోనిలుచున్నారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్నవారు చర్చించి వాళ్ళను మరో స్థానంలోనిలబెట్టారు. అంతకు ముందు కిచన్ లో అర్జున్ శివాజీ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రాను రాను లెక్క తగ్గుతుంది. ఇంకో ఐదు రోజుల్లో మరొకరు తగ్గుతారు అని శివాజీ అన్నాడు. అర్జున్ ఓ రెండు సేవింగ్స్ నాకు పట్టడం లేదు అని అన్నాడు. దానికి శివాజీ అలా ఏం లేదు అర్జున్ లాస్ట్ వీక్ రతికా ప్రామిస్ చేసింది నేను ఆడతా అని నేను కూడా లాస్ట్ వీక్ తాను సేవ్ అవుతుందని ఎక్స్పెట్ చేశా అని చెప్పాడు. ఆమెకు నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా డే లో నువ్వు రెండు నిమిషాల కంటెంట్ ఇవ్వు బతికిపోతావ్ అని.. అన్నాడు శివాజీ. అది సరే అన్న నామినేషన్స్ లో ఆమె స్ట్రాంగ్ పాయింట్ చెప్పడం లేదు తిప్పుతుంది అన్నాడు అర్జున్. నిన్న బాగానే చేసిందిగా అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత మీరు రెచ్చగొడితే నేను రెచ్చిపోను అని అంటుంది. ఎవరనుకుంటున్నారు తనను  రెచ్చగొట్టాలని.. నిన్ను కెలికితే అది రెచ్చగొట్టడం అవుతుంది. అలాగే నీ నుంచి నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అని అంటుంది. ఎక్స్ పెక్ట్ చేయడం ఏంటి? నేను ఏమన్నా తన ఫ్రెండ్‌నా ఏంటీ’ అన్నాడు శివాజీ . ఇలా ఈ ముచ్చట్లు సాగాయి.

ఇక టాస్క్ మొదలైంది. బిగ్ బాస్ ర్యాంక్ వైజ్ గా నిలబడాలని చెప్పగానే యావర్, గౌతమ్, అర్జున్‌లు ఒకటో స్థానంలో.. ప్రియాంక., శివాజీ రెండో స్థానంలో.. శోభాశెట్టి మూడో స్థానంలో.. అమర్ దీప్, అశ్వినిలు నాలుగో స్థానంలో.. రతిక ఐదో స్థానంలో నిలబడింది.ఆతర్వాత హౌస్ మొత్తం కలిసి ఒకొక్కరిని డిసైడ్ చేశారు. ముందుగా అర్జున్ రతికాను పదోస్థానంలో నిలబెట్టాలని అన్నాడు. దానికి ప్రియాంక కూడా అవును అంది మిగిలిన వాళ్ళు కూడా పదోస్థానమే కరెక్ట్ అన్నారు. అయితే యావర్ మాత్రం ఆమె ఇంప్రూవ్ అయ్యింది 7 వ స్థానం, అన్నాడు శివాజీ 9 అన్నాడు. ఎక్కువ మంది పదో స్థానమే అనడంతో ఆమెను పదోస్థానంలో నిలబడమన్నారు.

దాంతో నేను ఒప్పుకోను మీ పాయింట్స్ చెప్పండి అని అంది రతికా. అర్జున్ మొదలు పెట్టాడు నువ్వు బయటకు వెళ్ళివచ్చావ్ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటావ్ టాస్క్ లు బాగా ఆడుతావ్ అని అనుకున్నాం కానీ అలా చేయడం లేదు. దాంతో హౌస్ మొత్తం ఏకాభిప్రాయంతో నిన్ను పదో స్థానంలో నిలబెట్టాం అన్నాడు. దానికి రతికా నేను ఒప్పుకోను అని గొడవ చేసింది. గౌతమ్ తోపాటు మిగిలిన వాళ్ళు కన్విన్స్ చేయడంతో వెళ్లి పదో స్థానంలో నిలబడింది. ఓవర్ ఆల్ గా ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో శివాజీకి నెంబర్ 01, యావర్‌కి నెంబర్ 02, ప్రశాంత్‌కి నెంబర్ 03, ప్రియాంక 4 , శోభా 5, అమర్ 6, గౌతమ్‌కి 7, అర్జున్‌కి 8 , అశ్విని 9, రతికాకు 10 స్థానాలు ఇచ్చారు.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.