మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీల పెళ్లి ఘడియలు సమీపిస్తున్నాయి. ఇటలీలోని టస్కానీలో బుధవారం (నవంబర్ 1)న ఈ ప్రేమ పక్షుల వివాహం గ్రాండ్‌గా జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అలాగే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక వరుణ్, లావణ్యల పెళ్లి కోసం మెగా, అల్లు కుటుంబ సభ్యులు, అటు లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు కూడా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్- లావణ్యల వివాహాంపై ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్లకు హాజరైన ఆమె వరుణ్ పెళ్లికి వెళ్లడం లేదంటూ కామెంట్స్ చేశారు. ‘నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. నా పిల్లలు ఆద్య, ఆఖీరాలు వెళ్లారు. ఇక వరుణ్ తేజ్ నా కళ్ల ముందే పెరిగాడు. నా ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయి. ఒకవేళ నేను వరుణ్ పెళ్లికి వెళ్తే అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశముంది. అందుకే వెళ్లట్లేదు. అకీరా, ఆద్య కూడా పెళ్లికి హాజరుకావడం లేదు’ అని చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్.
సుమారు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై దర్శనమిచ్చారు రేణూ దేశాయ్. ఆమె నటించిన టైగర్ నాగేశ్వర రావు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇందులో రేణూ పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక వరుణ్, లావణ్యల పెళ్లి విషయానికొస్తే.. సోమవారం (అక్టోబర్ 30) కాక్ టైల్ పార్టీ తో వివాహ వేడుకలు మొదలయ్యాయి. మంగళవారం ( అక్టోబర్ 31) మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. ఇక నవంబర్ 1న లావణ్య మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు వరుణ్. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దీ మంతి సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరవుతున్నారు. పెళ్లికి హాజరు కానీ సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‍లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రేణూ దేశాయ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..