Most Recent

Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా సాగిన నామినేషన్.. సీరియస్ అయిన శివాజీ

Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా సాగిన నామినేషన్.. సీరియస్ అయిన శివాజీ

బిగ్ బాస్‌లో ఆదివారం ఎపిసోడ్ లో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ ఎలిమినేట్ అవుతాడని అస్సలు ఎవ్వరూ ఊహించలేదు. సందీప్ ఎలిమినేట్ కావడంతో సోమవారం నుంచి నామినేషన్స్ మొదలయ్యాయి. ఇక ఈ నామినేషన్స్ లో హీట్ పెంచేశాడు బిగ్ బాస్. హౌస్ లో ఒకొక్కరు అనర్హులు అనుకునే ఇద్దరినీ నామినేట్ చేయాలని చెప్పాడు అనర్హులు అని భావించే వారిని డ్రాగన్ స్నేక్ ముందు ఉంచాలని చెప్పాడు. దాంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ముందుగా ప్రశాంత్ తో మొదలు పెట్టారు. ఫస్ట్ అమర్‌దీప్‌ని నామినేట్ చేశాడు ప్రశాంత్. కెప్టెన్సీ రేసు నుంచి నన్ను తప్పించినప్పుడు చెప్పిన కారణం నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు ప్రశాంత్. పండించినోడివి పంచుకోవడం తెలియాలని అన్నావ్ .. అది నాకు నచ్చలేదు అన్న.. ఓడిపోయిన నీకే అంతుంటే.. నాకెంత ఉండాలి అని ప్రశాంత్ అన్నాడు.

దానికి అమర్ దీప్ సీరియస్ అయ్యాడు. ఈరోజు నువ్వు ఎక్కిస్తున్నావ్.. నీకు ఇది తిరిగి రాకపోదు.. ఆ రోజు నువ్వు రా మాట్లాడుకుందాం.. ఎన్నేసినా సరే నేను ఇక్కడున్నంత వరకు అయినోడిని మళ్లీ కెప్టెన్ కానీయను..అంటూ డైలాగ్ కొట్టాడు. ఆతర్వాత తేజకు నామినేట్ చేశాడు. కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించిందుకు తేజను నామినేట్ చేశాడు ప్రశాంత్.

ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్‌లో వచ్చావ్.. ఒక బాంబ్ లా ఆడుతావ్ అనుకున్నా.. కానీ అది లేదు. అంచనాలు అందుకోలేకపోయావ్.. వచ్చిన దగ్గర నుంచి ఒక్క దగ్గరే ఉండిపోయావ్. బాంబ్‌లాగ అంటే ఎలా..? గడబిడ అని గట్టిగా అరవాలా.. మీ ఎవరితో నేను మాట్లాడలేదా.. అని రతికా చెప్పింది. . నా క్లారిటీ నాకు ఉంది.. అంటూ రతిక అంటే నేను ఏంటో చూపిస్తా అన్నావ్ కదా.. లాస్ట్ వీక్ చూపించలేకపోయావ్ .? అని ప్రియాంక ప్రశ్నించిది. దానికి రతికా ఎదో చెప్పింది. ఆతర్వాత భోలే ని నామినేట్ చేసింది. వెంటనే మనోడు తన యాటిట్యూడ్ చూపిస్తూ యస్ ప్రియాంక అంటూ లేచి నిలబడి.. ర్యాగింగ్ చేశాడు. దీంతో మీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు.. అన్యు సీరియస్ అయ్యింది ప్రియాంక. ఆతర్వాత అర్జున్ శోభను నామినేట్ చేశాడు. అలాగే అమర్ ను నామినేట్ చేశాడు. ఆతర్వాత వచ్చిన శివాజీ అమర్ ను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య గట్టిగానే వాడినా జరిగింది. ఆతర్వాత తేజను నామినేట్ చేశాడు శివాజీ. ఆతర్వాత రతికా తనను నామినేట్ చేసిన ప్రియాంకాను నామినేట్ చేసింది. ఆతర్వాత శోభను నామినేట్ చేసింది. తేజ అర్జున్ ను నామినేట్ చేశాడు. రతికని నామినేట్ చేశాడు తేజ. కాన భోలే ప్రియాంకాను నామినేట్ చేశాడు. ఆతర్వాత అమర్ ను నామినేట్ చేశాడు భోలే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.